‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు గారి సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి: సర్కారు వారి పాట స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంటర్వ్యూ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్. తాజాగా విడుదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఆల్ టైం రికార్డ్ ని సృష్టించింది. సర్కారు వారి పాట ట్రైలర్ 24గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతుంది. ఇక మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతంలో ‘సర్కారు వారి పాట’ ఆడియో ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్.. ప్రేక్షకులని అమితంగా అలరించాయి. ముఖ్యంగా కళావతి పాట 150మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. ఈ పాట లో మహేష్ బాబు వేసిన సిగ్నేచర్ స్టెప్స్ కు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి రీల్స్ సందడి చేశాయి. మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సినిమా కోసం గ్రేట్ సిగ్నేచర్ మూమెంట్స్ ని కంపోజ్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటించారు. కళావతి, పెన్నీ పాటలతో పాటు సర్కారువారి పాట నుంచి రాబోయే మాస్ సాంగ్ విశేషాలు ఇలా పంచుకున్నారు… ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు ? బుల్లితెర, వెండితెరని అలరిస్తున్నారు. మీ సీక్రెట్ ఏమిటి ? సీక్రెట్ ఏం లేదండీ. ఇచ్చిన పని చక్కగా చేయడమే. నా దృష్టి వెండితెరపైనే వుంది. ఐతే నెలకు రెండు రోజులు టీవీ షూటింగ్ కి సమయం కేటాయించా. సర్కారు వారి పాటలో ఎన్ని పాటలు చేశారు ? మూడు. కళావతి, పెన్నీ, ఇంకో మాస్ సాంగ్. కళావతి, పెన్నీ ఇప్పటికే విజయాలు సాధించాయి. రాబోతున్న పాట కూడా ఫ్యాన్స్ కు గొప్ప ట్రీట్. ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. ఈ సినిమాలో మహేష్ బాబుగారి డ్యాన్సులు ఎలా వుంటాయి ? వండర్ ఫుల్ గా వుంటాయి. ఫ్యాన్స్ కు బాగా నచ్చుతాయి. డ్యాన్స్ ఎంతబాగా చేశారో చూసిన తర్వాత మీరే చెప్తారు. ఇప్పుడు పాటలన్నీ ఇన్స్టంట్ హిట్స్ అవుతున్నాయి కదా ? ఇలాంటి పాటలు ఇవ్వడం ఎంత చాలెజింగా వుంటుంది? ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక పాటలో అందరూ చేయగలిగే రెండు యునిక్ స్టెప్స్ వుంటే అది సోషల్ మీడియా రీల్స్ లోకి వెళ్లి హిట్స్ అవుతున్నాయి. అలాంటి యునిక్ స్టెప్స్ పై ద్రుష్టి పెట్టాల్సి వుంటుంది. కళావతి పెన్నీ సాంగ్స్ పై చాలా మంది రీల్స్ చేశారు. ఇప్పుడు రాబోతున్న మాస్ సాంగ్ కూడా అదిరిపోతుంది. అందులో కూడా యునీక్ స్టెప్స్ వుంటాయి. ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నపుడు ఒత్తిడి వుంటుందా ? ఒత్తిడి వుండదు. ఒక సాంగ్ కి మించిన సాంగ్ ఇవ్వాలనే పట్టుదల వుంటుంది, దాని కోసమే కష్టపడి పని చేస్తాం. సరిలేరు నికెవ్వరులో మైండ్ బ్లాక్ పాట సూపర్ హిట్. దానికంటే గొప్ప పాట ఇవ్వడానికి ప్రయత్నించాం.పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది. ...