• The re-release of Kushi Producer AM Rathnam Interview

    The re-release of Kushi gives fans another opportunity to celebrate the iconic film again: Producer AM Rathnam   *Kushi is a memorable love story ...
  • Sindooram Movie Siva Balaji Interview

    సిందూరం సినిమా కోసం మొదటిసారి నక్సలైట్ పాత్రలో నటించాను : శివ బాలాజీ  !!!   శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ...
  • Waltair Veerayya Veera Simha Reddy Sekhar Master Interview Photos

    చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి సంక్రాంతికి రావడం ఇంకా పెద్ద పండగ: కొరియోగ్రాఫర్ విజే శేఖర్ మాస్టర్ ఇంటర్వ్యూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ...
  • Interview with producer TG Vishwa Prasad

    ‘ధమాకా’కి గ్రాండ్ గా ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రేక్షకులు నుండి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఇంటర్వ్యూ మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ”ధమాకా’. ...
  • 18 Pages Sarayu Interview Photos

    The way I see myself has changed with 18 Pages – Sarayu How are you feeling about the success of 18 pages? I’m enjoying ...
  • ధమాకా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్.. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు : మాస్ మహారాజా రవితేజ ఇంటర్వ్యూ   మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో హీరో రవితేజ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ధమాకా ప్రమోషన్స్ లో కొత్తగా కనిపిస్తున్నారు.. ఫ్యాన్ మీట్ జరిగింది కదా ? ఫ్యాన్స్ తో కలవడం జరుగుతూనే వుంటుంది. ఫ్యాన్ మీట్ ని చాలా ఎంజాయ్ చేశాను. అన్ని చోట్ల పాజిటివ్ గా వుంది. ఆ పాజిటివిటీనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది.   ఏ సినిమా ప్రమోష‌న్లలోనూ సినిమా గురించి పెద్దగా మాట్లాడ‌రు.. హైప్ ఇవ్వరు కదా ? ఇప్పుడే కాదండీ.. మొదటి నుండి నేనింతే. మనం మాట్లాడకూడదు.. సినిమానే మాట్లాడుతుంది. సినిమా విడుదలైన తర్వాత ఆటోమేటిక్ గా సినిమానే మాట్లాడుతుంది కదా.   ధమాకా ఎలాంటి సినిమా ? ధమాకా మంచి ఎంటర్ టైనర్. రాజా ది గ్రేట్ తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయలేదు. ధమాకా ఫుల్ ఎంటర్ టైనర్. జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు.    ఈ మధ్య మీ నుండి సీరియస్ సినిమాలు వచ్చాయి కదా ? అటు వైపు వెళ్ళడానికి కారణం ? అన్నీ ప్రయత్నించాలి కదా. ఫలితం మాట పక్కన పెడితే ప్రయత్నం జరుగుతూనే వుండాలి.   ధమాకాని రౌడీ అల్లుడు తో పోలుస్తున్నారు ? మా రచయిత ఈ మాట చెప్పి వుంటారు. తెలుగు లో ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు మొదలుపెట్టింది చిరంజీవి గారు. తర్వాత మేమంతా ఫాలో అయ్యాం.  ధమాకా, రౌడీ అల్లుడు లాంటి ఎంటర్ టైన్ మెంట్ సినిమానే. అందులో ఎలాంటి సందేహం లేదు.   ఈ మధ్య కొత్త రచయితలతో ఎక్కువ పని చేస్తున్నారు కదా  ?  ఈ మధ్య కాదు. ఎప్పటి నుండో వుంది. నాకు కొత్త రచయితలతో పని చేయడం ఇష్టం. వాళ్ళలో ఒక ఆకలి, తపన వుంటుంది. నేను అలా వచ్చినవాడినే కదా.   మీ ఎనర్జీ భీమ్స్ కి ఇచ్చినట్లు వున్నారు ? రెచ్చిపోతున్నాడు.(నవ్వుతూ) ధమాకా ఆల్బమ్ ఇరగదీశాడు. తను చాలా మంచి ట్యూన్ మేకర్. ధమాకా సౌండ్ అదిరిపోయింది. అన్నీ పాటలు అద్భుతంగా చేశాడు. ...
  • Anupama Parameswaran Interview 18 pages Movie Photos

    ఇప్పటి వరకు నేను చేసిన లవ్ స్టోరీస్ లో ఈ “18 పేజెస్” నా ఫెవరెట్ మూవీ..    వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ...
  • Sreeleela Interview Photos Dhamaka Movie

    రవితేజ గారితో సినిమా చేయడం నా అదృష్టం. ‘ధమాకా’ హిలేరియస్ ఎంటర్ టైనర్ : హీరోయిన్ శ్రీలీల ఇంటర్వ్యూ    మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ శ్రీలీల విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.   ధమాకా ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? దర్శకుడు త్రినాథరావు నక్కిన గారు తన గత చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు.  అప్పుడే రచయిత ప్రసన్న కూడా పరిచయమయ్యారు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. పెళ్లి సందడి విడుదల కాకముందే ‘ధమాకా’ కథ చెప్పారు. కథ చెప్పిన పది నిమిషాలకే ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాను.   ధమాకా కథని ఎంచుకోవడానికి కారణం ? ధమాకా చాలా మంచి ఎంటర్ టైనర్. చాలా హిలేరియస్ గా వుంటుంది. నాకు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చాలా ఇష్టం.   తక్కువ సమయంలోనే రవితేజ గారితో పని చేసే అవకాశం అందుకున్నారు కదా .. ఎలా ఫీలౌతున్నారు ? గ్రేట్ ఫుల్ ఫీలింగ్. రాఘవేంద్ర రావు గారి సినిమాతో లాంచ్ కావడం తర్వాత రవితేజ గారితో ధమాకా లాంటి బ్యూటీఫుల్ ప్రాజెక్ట్ చేయడం చాలా లక్కీగా వుంది. రోజూ దేవుడికి థాంక్స్ చెప్పుకుంటాను. మొదటి సినిమా అంతా కొత్తవారితో జరిగిపోయింది. రెండో సినిమా రవితేజ గారు లాంటి స్టార్ హీరో కావడంతో మొదట చాలా టెన్షన్ పడ్డా. మొదట్లో మాట్లాడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఆయనతో పని చేస్తుంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. రవితేజ గారు చాలా మోటివేట్ చేస్తారు. ఆయనతో పని చేయడంలో ఒక కంఫర్ట్ వుంటుంది. సెట్ లో చాలా సపోర్ట్ చేస్తారు. రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. ఆయన్ని మొదటిసారి సెట్ లో చూసినప్పుడు ఒక సర్ ప్రైజ్ ఫీలింగ్. పాత్రలో వేరియేషన్స్ ని చాలా ఈజీగా చూపించగలరు. ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారని ఆయన్ని అడుగుతుంటాను.  ‘విక్రమార్కుడు’ డ్యుయల్ రోల్ ఎంత అవుట్ స్టాండింగా చేశారో.. ధమాకాలో అంతే అద్భుతంగా చేశారు.   రవితేజ గారి ఎనర్జీకి మ్యాచ్ చేశారా ? సినిమా చూసి మీరే చెప్పాలి(నవ్వుతూ).  డ్యాన్సులు చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. నాకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే ఇష్టం. డ్యాన్స్ నేర్చుకున్నాను.   దర్శకుడు త్రినాథరావు నక్కిన గత చిత్రాలు చూశారా ? చూశా. నేను లోకల్ పాటలు బెంగళూర్ లో వునప్పుడు తెగ వినేదాన్ని. అందులో కీర్తి సురేష్ గారి పాత్ర నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. ఆయన చాలా పాజిటివ్ పర్సన్.   ధమాకాలో మీ ఫేవరేట్ సాంగ్ ? జింతాక్ పాట బాగా నచ్చింది. తర్వాత వాట్స్ హ్యాపనింగ్ పాట. అందులో వయోలిన్ బిట్ చాలా ఇష్టం.   ...
  • 18 Pages Directed by Palnati Surya Pratap Interview Photos

    18 Pages: సినిమా ఎండింగ్ మాత్రం అలా గుర్తుండిపోతుంది – సూర్య ప్రతాప్ పల్నాటి కుమారి 21 బ్లాక్ బస్టర్ తరువాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది.? ఫస్ట్ మూవీ కరెంట్ అయిపోయాక ...