interview
-
Matti Kusti Heroine Aishwarya Lakshmi Interview
నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ పాత్ర ‘మట్టి కుస్తీ’లో చేశా: హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూ హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి ... -
Hit 2 Director Sailesh Interw Photos
నాని గారితో కచ్చితంగా సినిమా తీయాలి.. హిట్ ఇవ్వాలి.. డైరెక్టర్ శైలేష్ కొలను ‘హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు తగ్గట్టే హిట్ ... -
Viva Harsha Matti Kusthi Movie interview Photos
‘మట్టి కుస్తీ’ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : హీరో విష్ణు విశాల్ ఇంటర్వ్యూ హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయిక. ‘ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో హీరో విష్ణు విశాల్ చిత్ర విశేషాలని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు. ‘మట్టి కుస్తీ’ గురించి చెప్పండి ? ‘మట్టి కుస్తీ’ భార్యా భర్తల ప్రేమ కథ. భార్యాభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కథలో కుస్తీ స్పోర్ట్ కూడా భాగంగా వుంటుంది. కేరళలో మట్టికుస్తీ అనే స్పోర్ట్ వుంది. ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి మట్టికుస్తీ అనే పేరు పెట్టాం. పెళ్లి తర్వాత భార్యాభర్తలకు కొన్ని అంచనాలు వుంటాయి. ఆ అంచనాలని అందుకోలేనప్పుడు ఇగోలు మొదలౌతాయి. మట్టికుస్తీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. స్పోర్ట్స్ కూడా లైట్ హార్టెడ్ గా వుంటుంది. సినిమా చాలా వినోదాత్మకంగా వుంటుంది. ‘మట్టి కుస్తీ’లో నా కెరీర్ లో మొదటి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మసాల ఫిల్మ్. స్పోర్ట్ 20 నిమిషాలే ఉంటుందా ? ఇందులో చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వుంటాయి. స్పోర్ట్ ఇరవై నిమిషాల కంటే ఎక్కువే వుంటుంది. ఇందులో నేను కబడ్డీ ప్లేయర్ ని. కానీ కుస్తీ ఆటకి వెళ్తాను. అలా ఎందుకు వెళ్ళాల్సివచ్చిందో.. సినిమా చూసినప్పుడు ఇది చాలా సర్ ప్రైజింగా వుంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా వుంటాయి. ట్రైలర్ లో ” వెయ్యి అబద్దాలాడైన ఒక పెళ్లి చేయమని చెప్పారు. కానీ రెండు అబద్దాలు ఆడి ఈ పెళ్లి చేశాం’ అని డైలాగ్ వుంటుంది. ఆ రెండు అబద్దాలు ఏమిటనేది మీకు సినిమా చూసినప్పుడే తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కట్ చేయడం నా కెరీర్ లో పెద్ద సవాల్ గా అనిపించింది. సర్ ప్రైజ్ రివిల్ చేయకుండ కంటెంట్ ని చెప్పడం ఒక చాలెంజ్. ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ విడుదల చేయడం వరకూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఫస్ట్ లుక్ చూస్తే ఇది స్పోర్ట్ మూవీ అనిపించింది. తర్వాత ఒకొక్కటిగా రివిల్ చేస్తూ ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచి థియేటర్లో చూడాలనే ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేశాం. భార్యా భర్తల నేపధ్యం అంటే హాస్యానికి కూడా అవకాశం వుంటుంది కదా ? మట్టికుస్తీలో కూడా చాలా కామెడీ వుంది. ఒక రిలేషన్ షిప్ లో వున్నపుడు ఖచ్చితంగా ఇగో వుంటుంది. అయితే ఇందులో ఆడ మగ సమానమని చెప్పే సందేశం కూడా వుంది. అయితే దిన్ని ఒక సందేశం గా కాకుండా వినోదాత్మకంగా చెప్పాం. మహిళా ప్రేక్షకులు కూడా మట్టికుస్తీని చాలా ఇష్టపడతారు. మట్టికుస్తీ నటీనటులు గురించి ? మునిష్ కాంత్, కరుణ, కింగ్స్లి పాత్రలు వినోదాత్మకంగా వుంటాయి. తెలుగు నటులు అజయ్ గారు విలన్ గా చేశారు. శత్రు గారు మరో నెగిటివ్ పాత్రలో కనిపిస్తారు. రవితేజ గారు ఈ ప్రొజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? ‘ఎఫ్ఐఆర్’ సినిమాని తెలుగులో విడుదల చేసే సమయంలో ఒక ఫ్యామిలీ ఫ్రండ్ ద్వారా రవితేజ గారిని కలిశాను. నేను చేసే సినిమాలు రవితేజ గారికి చాలా నచ్చాయి. ఎఫ్ఐఆర్ ట్రైలర్ ఆయనకి చాలా నచ్చింది. ఆ సినిమాని ప్రజంట్ చేశారు. ఆ సమయంలోనే తర్వాత ఏం చేస్తున్నావని అడిగారు. అప్పుడు ఈ లైన్ చెప్పాను. అది వినగానే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రోడ్యుస్ చేస్తానని చెప్పారు. అలా జర్నీ మొదలైయింది. రవితేజ గారు నన్ను ఎంతో నమ్మారు. 13 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో వున్నాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి ఎవరినైనా కలిస్తే నా బిజినెస్, మార్కెట్ గురించి మాట్లాడేవారు. కానీ రవితేజ గారు ఒక్క మీటింగ్ లో నన్ను సంపూర్ణంగా నమ్మారు. ఆయన నమ్మకం నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆయనకి నా ... -
Galodu full mass commercial movie Sudhirgali Sudheer
‘గాలోడు’ ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా – సుడిగాలి సుధీర్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న మాస్అండ్‌యాక్షన్ ఎంటర్‌టైనర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ... -
Producer Atluri Ramarao Interview Nachindi-Girlfriend-movie Movie
నవ రసాలు ఉండేలా తీసిన “నచ్చింది గర్ల్ ఫ్రెండూ”.. సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది..మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై పై ఉదయ్ ... -
Hari Harish interview Yashoda movie
*సమంత ‘వన్ మోర్ కావాలా?’ అని అడిగేవారు… ఆవిడ హెల్త్ కండిషన్ షూటింగ్ చేసేటప్పుడు మాకు తెలియదు – ‘యశోద’ దర్శకులు హరి, హరీష్ ఇంటర్వ్యూ* – – – ... -
Yashoda Movie Samantha Interview
Samantha About Yashoda Hello Samantha gaaru. How is ur health now? Thank you for asking. I am on the path to recovering. Hopefully things ... -
Nachindi Girl Friendu Heroine Jenifer interview
*సంధ్య క్యారెక్టర్ లో ఆకట్టుకుంటా – “నచ్చింది గాళ్ ఫ్రెండూ” హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్* ఉదయ్ శంకర్, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. ఈ ... -
RamaRao on Duty Movie Art Director Sahi Suresh interview
రామారావు ఆన్ డ్యూటీ’ కోసం 95 బ్యాక్‌డ్రాప్ ని అద్భుతంగా రిక్రియేట్ చేశాం: ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ ఇంటర్వ్యూ మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమౌతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సాహి సురేష్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్ర విశేషాలివి. ఆర్ట్ డైరెక్టర్ గా మీ కెరీర్ ఎలా మొదలైయింది ? ‘భైరవ ద్వీపం’ చూసిన తర్వాత ఆర్ట్ విభాగంపై ఇష్టం పెరిగింది. ఇష్టం కాస్త వ్యామోహంగా మారింది,. సినీ పరిశ్రమలో తెలిసినవారి ద్వారా ఆర్ట్ విభాగంలో చేరారు. నా అదృష్టవశాత్తూ భైరవదీపం చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన పేకేటి రంగా గారి దగ్గర చేరాను. తర్వాత అశోక్, ఆనంద్ సాయి గారితో కలసి పని చేశాను. అంత గొప్ప అనుభవం వున్న వారి దగ్గర పని చేయడం వలన ఆర్ట్ విభాగంపై మంచి పట్టు దొరికింది. శక్తి సినిమాకి ఆనంద్ సాయి గారితో పని చేస్తున్నపుడు అశ్వనీదత్ గారు నా ప్రతిభని గుర్తించి ‘సారొచ్చారు’ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. రవితేజ గారు కొత్త వారిని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఆర్ట్ డైరెక్టర్ గా ఆయన నన్ను అంగీకరించారు. ఆ రోజు నుండి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. నిర్విరామంగా దాదాపు 40 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశాను. 40 సినిమాలు చేశారు కదా.. మీకు సవాల్ గా అనిపించిన చిత్రం ? మీకు తృప్తిని ఇచ్చిన చిత్రం ? కంచె, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, ‘అ’ చిత్రాలు చాలా తృప్తిని ఇచ్చాయి. ఈ చిత్రాలకు చాలా ప్రశంసలు కూడా దక్కాయి. చాలా మంది దర్శకులు అభినందించారు. దర్శకురాలు సుధా కొంగర ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం చూసి ఫోన్ చేసి ఆర్ట్ విభాగం అద్భుతంగా వుందని మెచ్చుకున్నారు. ‘రామారావు అన్ డ్యూటీ’ ఆర్ట్ వర్క్ ఎలా వుంటుంది ? ‘రామారావు అన్ డ్యూటీ’ ఛాలెజింగ్ మూవీ. నాకు ప్రతి రెండేళ్ళకోసారి పిరియాడికల్ సినిమాలు వస్తున్నాయి. ‘రామారావు అన్ డ్యూటీ’ 95లో రూరల్ జరిగే కథ. 95 నేపధ్యాన్ని దాదాపు మొత్తం రిక్రియేట్ చేశాం. చాలా రీసెర్చ్ చేశాం. ఆనాటి గ్రామం, వీధులు, ఎమ్మార్వో ఆఫీస్.. ఇలా అద్భుతమైన సెట్స్ వేశాం. అలాగే పాటల కోసం కూడా గ్రాండ్ సెట్స్ వేశాం. రవితేజ గారికి ఎమ్మార్వో ఆఫీస్ సెట్ చాలా నచ్చింది. మేము రీసెర్చ్ చేసిన పెట్టిన ప్రతి డిటేయిల్ ని ఎంతో ఆసక్తిగా అడిగేవారు. దర్శకుడు ఒక కథ చెప్పిన తర్వాత ఒక ఆర్ట్ డైరెక్టర్ గా ఎలాంటి హోం వర్క్ చేస్తారు ? రెఫరెన్స్ లు తీస్తాము.. ఆ జోనర్ కి సంబందించిన సినిమాలు చూస్తాము. ఒక సీన్ కి సంబధించి రీసెర్చ్ కూడా వుంటుంది. నా వరకూ నేచురల్ గా చూపించడానికే ప్రయత్నిస్తాను. ‘రామారావు అన్ డ్యూటీ’ దర్శకుడు శరత్ మాండవతో పని చేయడం ఎలా అనిపించింది ? శరత్ కొత్త దర్శకుడైనప్పటికీ ఆయనలో చాలా క్లారిటీ వుంది. దర్శకుడు క్లారిటీ గా వున్నపుడు అవుట్ పుట్ కూడా అద్భుతంగా వస్తుంది, ‘రామారావు అన్ డ్యూటీ’లో అది వర్క్ అవుట్ అయ్యింది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ కి బడ్జెట్ పెట్టినప్పుడు ప్రొడక్షన్ హౌస్ లో చాలా చర్చలు జరుగుతాయి. కానీ ‘రామారావు అన్ డ్యూటీ’ నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. మాకు ఎలాంటి సమస్య రాలేదు. మేము కోరుకున్నది సమకూర్చారు. దీనికి కారణం దర్శకుడిలో వున్న క్లారిటీ. మీ ఆర్ట్ వర్క్ కి హీరోల నుండి ఎలాంటి ప్రసంశలు వస్తుంటాయి ? ఎన్టీఆర్ కథానాయకుడు , మహానాయకుడు చిత్రాల ఆర్ట్ వర్క్ కు బాలకృష్ణ గారు చాలా అభినందించారు. ఎన్టీఆర్ గారి పాత సినిమాలన్నీ రిక్రియేట్ చేయడం చూసి ప్రతిసారి మెచ్చుకునే వారు. అ సినిమాకి కూడా మంచి ప్రసంసలు దక్కాయి. నాగ చైనత్యగారి చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. నితిన్ గారి భీష్మ చేశాను. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం చేస్తున్నాను. నితిన్ గారు తన ప్రతి ప్రాజెక్ట్ ని నన్నే చేయమని చెప్పడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి సినిమాకి కొత్తదనం చూపించడానికి ఒక ఆర్ట్ డైరెక్టర్ గా ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తారు ? ఆర్ట్ అనేది దర్శకుడు ఇన్స్పైర్ చేసిన దాని బట్టి కొత్తగా మారుతుంటుంది. ఇది చాలా ప్రధానం. దర్శకుడు ఎంత ఇన్స్పైర్ చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. దర్శకుడు, డీవోపీ, ఆర్ట్ డైరెక్టర్,,. ఈ ముగ్గురి కెమిస్ట్రీ బావుంటే అవుట్ పుట్ నెక్స్ట్ లెవెల్ లో వుంటుంది. ఆర్ట్ డైరెక్టర్- ప్రొడక్షన్ డిజైనర్ గా మార్పు వచ్చిన తర్వాత మీ వర్క్ లో ఎలాంటి మార్పు వచ్చింది? వర్క్ లో ఎలాంటి మార్పు లేదు, ప్రొడక్షన్ డిజైనర్ అనేది హాలీవుడ్ వుంది. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ డ్రస్సులు, కలర్స్, సెట్స్ ఇలా అన్నీ ముందే డిసైడ్ చేసేస్తారు. తర్వాత ఎవరి పార్ట్ వారు చూసుకుంటారు. మనకి ఇప్పుడిప్పుడే మొదలైయింది. ప్రేక్షకులు ప్రతిది పరిశీలిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ కి రావాల్సిన పేరు వస్తుంది. ...