• Electrifying Retro Motion Poster Of Karunada Chakravarthy Shiva Rajkumar’s Action Spectacle GHOST     Karunada Chakravarthy Shiva Rajkumar’s maiden Pan India Film ‘Ghost’ is ...
  • Nandamuri Balakrishna, Shruti Haasan, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Mass Mogudu Song Lyrical On January 3rd God of masses Natasimha Nandamuri ...
  • Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Custody Glimpse Gives The Adrenaline Rush Naga Chaitanya’s Telugu-Tamil bilingual project directed by ...
  • సక్సెస్ మీట్ లో రాజయోగం చిత్రబృందం  ఈ చిత్రం చూసి నవ్వకుండా ఉండగలిగితే వాళ్ళకు లక్ష రూపాయల బహుమతి ఇస్తాం – సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా ...
  • చిరంజీవి గారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ గారి ‘వీరసింహారెడ్డి’ యాక్షన్ సీక్వెన్స్ లు పవర్ ఫుల్ గా వుంటాయి : యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలౌతుండగా, ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ గా రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల విశేషాలని పంచుకున్నారు.     మీ యాక్షన్ ప్లాన్ ఎలా వుంటుంది.. యాక్షన్ ని ఎలా డివైడ్ చేసుకుంటారు ? రామ్ లక్ష్మణ్ మాస్టర్స్:  యాక్షన్ ఐడియాలు ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు. మా అదృష్టం ఏమిటంటే ఇద్దరం వున్నాం కాబట్టి రెండు ఆప్షన్స్ ని డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకెళతాం. అందులో ఒక ఆప్షన్ డైరెక్టర్ గారికి నచ్చుతుంది. మేము ఇలానే ప్లాన్ చేసుకుంటాం.   ఇప్పుడు ప్రతి ఫైట్ కి కాన్సెప్ట్ వుంటుంది కదా ? రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: ఫైట్ కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. లేకపోతే ఫైట్ కి పరిపూర్ణత రాదు. ఫైట్ అనేది ఎప్పటినుండో ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. ఒక ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్, క్యారెక్టరైజేషన్, కొత్తదనం ని యాడ్ చేసి ఒక కాన్సెప్ట్ గా ఫైట్ ని కంపోజ్ చేయడం వలనే థియేటర్ లో ప్రేక్షకులు విజల్స్, చప్పట్లు కొట్టిమరీ ఎంజాయ్ చేస్తారు. క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ ప్రకారం కూడా యాక్షన్ డిజైన్ చేయాలి. వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు గారు చైర్ లో కూర్చుని వుంటారు. ఎదురుగా రౌడీలు వస్తుంటారు. బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ ప్రకారం.. ఈ రౌడీలని కూడా నిల్చునికొట్టాలా ? అనే ఆలోచన వచ్చింది. దీంతో బాలయ్య బాబు గారు చైర్ లో కూర్చునే ఒక పవర్ ఫుల్ ఫైట్ ని కంపోజ్ చేశాం. చైర్ లో కూర్చునే ఫైట్ చేయొచ్చు అనే  మూడ్ చాలా అద్భుతంగా క్రియేట్ అయ్యింది. అది బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ లో వున్న మ్యాజిక్.   వీరసింహా రెడ్డిలో చైర్ ఫైట్ లా..వాల్తేరు వీరయ్యలో కాన్సెప్ట్ ఫైట్ ఏమిటి ? రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: వాల్తేరు వీరయ్యలో ఇంటర్వెల్ సీక్వెన్స్ చేశాం. లుంగీ కట్టుకొని, శ్రీకాకుళం యాస మాట్లాడుతూ అందరితో సరదాగా కలిసిపోయే చిరంజీవి గారు.. ఇంటర్వెల్ లో సడన్ గా రెండు గన్స్ పట్టుకొని స్టయిలీష్ గా కనిపిస్తారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు- శ్రుతి హాసన్ మధ్య ఒక సరదా ఫైట్ కూడా కంపోజ్ చేశాం. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.   వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ ఎపిసోడ్ చేయడానికి ఎన్ని రోజుల పట్టింది ? రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: 15 రోజులు పట్టింది. కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు ఎన్ని రోజులైన అనుకున్నది సాధించే వరకూ పని చేయాల్సిందే. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పాలి. సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు. ఖర్చు గురించి వెనకాడరు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాలని నిర్మిస్తారు.   బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి ఇంటర్వెల్ ఫైట్ ఎలా వుంటుంది ? రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: వీరసింహా రెడ్డి ఇంటర్వెల్ ఫైట్ టర్కీలో చేశాం. అక్కడ భారీగా ఖర్చయ్యింది. ఫైట్ చాలా పవర్ ఫుల్ గా వుంటుంది.   చిరంజీవి గారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ గారి ‘వీరసింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతి వస్తున్నాయి. ఇద్దరి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వుంటాయి. అభిమానులు అంచనాలు అందుకునే విధంగా రెండు సినిమాల్లో యాక్షన్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు ? రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: చిరంజీవి గారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ గారి ‘వీరసింహారెడ్డి’ రెండు భిన్నమైన కథలు. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని రెండు భిన్నమైన క్యారెక్టరైజేషన్స్, బాడీ లాంగ్వేజ్ రాసుకున్నారు. రెండు డిఫరెంట్ గా వుండటం వలన క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది. ...
  • నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ #NBK108 మొదటి షెడ్యూల్‌ పూర్తి గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108 షూటింగ్ ...
  • మెగాస్టార్  చిరంజీవి, మాస్  మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ  మూవీ  మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ నాల్గవ పాట ‘పూనకాలు లోడింగ్’ విడుదల   -మెగాస్టార్  చిరంజీవి, మాస్  మహారాజా రవితేజల విశ్వరూపం వాల్తేరు వీరయ్య : పూనకాలు లోడింగ్ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ కొల్లి   పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ లోని నాల్గవ పాటను చూడండి.   ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల ‘పూనకాలు లోడింగ్’ పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్ లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. అలాగే  మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో ”డోంట్ స్టాప్ డ్యాన్సింగ్..  పూనకాలు లోడింగ్” అనడం పూనకాలని రెట్టింపు చేసింది.   చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది. జాతర సెటప్, భారీ జనసమూహం ఈ మాస్ నంబర్‌ అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. చిరంజీవి, రవితేజల బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా ఉపయోగించాడు. చిరంజీవి మాస్‌ లుక్, గెటప్.. ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు లాంటి బ్లాక్‌బస్టర్స్ ని గుర్తుకుతెస్తుంది. మరోవైపు రవితేజ ట్రెండీగా కనిపిస్తున్నారు. మెగామాస్ మ్యాజిక్‌ ని బిగ్ స్క్రీన్ ‌లపై చూడాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.   ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ మాట్లాడుతూ..  మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి రవితేజ ఫ్యాన్స్ కి అందరికీ వందనం. బాస్ పార్టీ పాటని ఐపాడ్ లో పవన్ కళ్యాణ్ గారికి చూపించాను. అభిమానుల రియాక్షనే ఆయన రియాక్షన్ కూడా. కళ్యాణ్ బాబు గారికి ఇష్టమైన జాతరలాంటి సినిమా వస్తుందని చెప్పాను. మనలాగే కళ్యాణ్ గారు కూడా వాల్తేరు వీరయ్య కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో పూనకాలు లోడింగ్ కేవలం హ్యాష్ ట్యాగ్ కాదు.. సినిమా మొత్తం పూనకాలు వస్తూనే వుంటాయి. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ విశ్వరూపం వాల్తేరు వీరయ్య. సినిమా అంతా జాతరలా వుంటుంది. ఇంత పూనకాలు తెప్పించిన దేవిశ్రీ ప్రసాద్ గారికి థాంక్స్.ఇంత గొప్ప మ్యాజిక్ స్క్రీన్ ప్రజన్స్ వున్న  ఇద్దరి గొప్ప స్టార్స్ ని నా ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నందుకు మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్స్. 13వ తేదిన పూనకాలు లోడింగ్ ఎనర్జీ ఏ స్థాయిలో వుంటుందో అందరూ చూడబోతున్నారు’ అన్నారు   నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు. ఈ సినిమాచేసే అవకాశం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా కృతజ్ఞతలు. మేము అడిగిన వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నా రవితేజ గారికి చాలా కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్యని గొప్పగా తీసిన దర్శకుడు బాబీ గారికి థాంక్స్. పూనకాలు లోడింగ్’పాటకు అభిమానులు ఐదు కి ఎంత రేటింగ్ ఇస్తే.. సినిమా కూడా అంతే రేటింగ్ లో వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. జనవరి 13వ తేదిన ఇంతకంటే ఎక్కువ ఆనందపడతారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.   కోన వెంకట్ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో చిరంజీవి గారి కళ్ళల్లో చూశాను. ఇంత హ్యాపీ గా బాస్ ని ఈ మధ్య కాలంలో చూడలేదు. మెగా ఫ్యాన్ బాబీ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాడు. మైత్రీ మూవీ మేకర్స్  సినిమాని ఎంతో ప్రేమించి నిర్మించారు. 13న తేదిన రికార్డులు ఎగురుతాయి” అన్నారు.    రోల్ రిడా మాట్లాడుతూ.. పూనకాలు లోడింగ్ పాట రాయడం నాఅదృష్టం. ఈ పాట రాయడం మెగామాస్ ఫీలింగ్. ఈ పాటని పాడటం కూడా జరిగింది. దర్శక నిర్మాతలకు దేవిశ్రీ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. జనవరి 13న అందరం థియేటర్ లో కలుద్దాం” తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, సప్తగిరి, చమ్మక్ చంద్ర తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.   బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత.   ...
  • Dr. MCR HRD INSTITUTE, GOVT. OF TELANGANA Foundation Courses for AIS & CCS and MES Officers Come to an End The two prestigious Foundation ...
  • బాలకృష్ణ గారి నుండి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ‘వీరసింహారెడ్డి’లో వున్నాయి. ఇప్పటివరకూ చూడని ఓ అద్భుతమైన పాయింట్  వీరసింహారెడ్డి కథలో వుంది:   డైలాగ్  రైటర్ సాయి మాధవ్ బుర్రాఇంటర్వ్యూ గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ లో వినిపించిన డైలాగులు కూడా సంచలనం సృష్టించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి మాటలు అందించిన స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా విలేఖరు సమావేశంలో ‘వీరసింహారెడ్డి’ చిత్ర విశేషాలని పంచుకున్నారు .   ‘వీరసింహారెడ్డి’ డైలాగ్స్ కంప్లీట్ మాస్ గా వుండబోతున్నాయా ? ‘వీరసింహారెడ్డి’ లో పక్కా మాస్ డైలాగ్స్ వుంటాయి. బాలకృష్ణ గారిని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో, ఎలాంటి డైలాగ్స్ వినాలని అనుకుంటారో అన్నీ  ఇందులో ఉంటాయి.   బాలకృష్ణ గారి లాంటి పెద్ద స్టార్ హీరోకి డైలాగ్స్ రాస్తున్నపుడు ఒత్తిడి ఫీలయ్యారా ? బాలకృష్ణ గారి నాలుగు చిత్రాలకు పని చేశాను. గౌతమీపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు.. ఇప్పుడు  ...
  • రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ‘హంట్’ విడుదల – – – – – – – – – – ...