• Unveiling The World of Natural Star Nani’s Next (#Nani30), Production No 1 Of Vyra Entertainments On January 1st, 2023  Natural Star Nani is one ...
  • ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం !!!       ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 5 గా తెరకెక్కుతున్న సినిమా ...
  • *సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన, నిర్మాత DSR నిర్మిస్తున్న నూతన చిత్రం “వచ్చిన వాడు గౌతం”*      శ్రీ శైలేంద్ర  సినిమాస్ పతాకంపై అశ్విన్ బాబు, పాలక్  లాల్వాని, విలక్షణ  ...
  • Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Fourth Song Poonakaalu Loading is out now What is Poonakaalu ...
  • Dhamaka success Event New Photos

    ‘ధమాకా’ని మాసీవ్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులు, అభిమానులకు కృతజ్ఞతలు: ధమాకా మాస్ మీట్ లో ధమాకా చిత్ర యూనిట్   మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌ టైనర్ ”ధమాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్  గ్రాండ్ నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ధమాకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా మాస్ మీట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.   మాస్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ధమాకాలో పని చేసిన టెక్నిషియన్స్ అందరికీ  కంగ్రాట్స్. ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ థాంక్స్. అద్భుతమైన వర్క్ చేశారు. డీవోపీ కార్తిక్ ఘట్టమనేని ఎక్స్ లెంట్ విజువల్స్ ఇచ్చారు. సినిమాలో అందరం అందంగా వున్నామంటే దానికి ప్రధాన కారణం కార్తిక్ కెమరా పనితనం. ఈ సినిమా విజయానికి మొట్టమొదటి కారణం.. మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో. సాలిడ్ సౌండ్ ఇచ్చాడు. ఈ సినిమా తో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు. ధమాకా సక్సెస్ కి రెండో కారణం .. పీపుల్స్ మీడియా మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం, వారి పాజిటివిటీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు అద్భుతమైన వ్యక్తులు. చాలా పాజిటివ్ గా వుంటారు. ఈ బ్యానర్ లో చాలా సినిమాలు రావాలి సూపర్ హిట్లు కావాలి. నేను కూడా ఈ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తాను. బ్యానర్ అంత నచ్చింది. విశ్వప్రసాద్ , వివేక్ గారికి కంగ్రాట్స్. భరణి గారు, తులసీ గారు చమ్మక్ చంద్ర, జయరాం గారు, చిరాగ్ అందరూ అద్భుతంగా చేశారు. రావు రమేష్, ఆది ధమాకాలో మరో హైలెట్. పాత సినిమాల్లో రావు గోపాల్ రావు, రామలింగయ్య గారిలా అద్భుతంగా వినోదం పంచారు.  ఈ సినిమాకి మరో ఆకర్షణ మా అందమైన హీరోయిన్ శ్రీలీల. అందం, ప్రతిభ,అభినయం అన్నీ వున్నాయి. ఇక డ్యాన్స్ ఐతే సూపర్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తను పెద్ద స్టార్ కాబోతుంది. ఈ విజయానికి మరో కారణం డైలాగ్ రైటర్ ప్రసన్న కుమార్. డైలాగులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇంద్ర సినిమా స్పూఫ్ , పల్సర్ బైక్ పాట ఐడియా కూడా ప్రసన్నదే. రామజోగయ్య శాస్త్రి గారు, కాసర్ల శ్యామ్ చాల మంచి సాహిత్యాన్ని అందించారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ధమాకా సినిమాకి డ్రైవర్ దర్శకుడు త్రినాథరావు, నేను కండక్టర్ ని(నవ్వుతూ).  త్రినాథరావు, ప్రసన్న కాంబో ఎప్పుడూ హిట్టే. సెకెండ్ హ్యాట్రిక్ లోకి ఎంటర్ అయ్యారు. అదీ కొట్టేయాలి. అందరినీ ఇలానే  ఎంటర్  టైన్ చేయాలి. ధమాకాకి అభిమానులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. పండగ చేసుకొని రెండేళ్ళు అయ్యింది. మళ్ళీ ఇప్పుడు పండగ. ఇకపై పండక్కి గ్యాప్ ఇవ్వొద్దు. పండగమీద పండగ చేసుకోవాలి. మీ సపోర్ట్ ఇలానే కొనసాగాలి. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.   హరీష్ శంకర్ మాట్లాడుతూ… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి అభినందనలు. ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. వివేక్ గారికి కంగ్రాట్స్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమోషన్స్ చూడలేదు.  ధమాకాని అద్భుతంగా ప్రమోట్ చేశారు.  అలాగే ఈ మధ్య కాలంలో ఇలాంటి వేడుకలు చూడలేదు. ఎందుకంటె ఈ మధ్య కాలంలో ఇలాంటి హిట్టు చూడలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. రవితేజ అన్నయ్య సినిమా హిట్ అయితే నా సినిమా హిట్ అయినట్లే వుంటుంది. ధమాకాతో నలుగురు స్టార్లు అయ్యారు. త్రినాథరావు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ప్రసన్న స్టార్ రైటర్ అయ్యాడు. బీమ్స్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. శ్రీలీల స్టార్ హీరోయిన్ అయ్యింది. రవితేజ అన్నయ్య ని మాస్ మహారాజా అని పిలుచుకునే వాడిని. సుమ గారికి ఓ వేడుకలో అలా పిలవమని చెప్పాను. దాన్ని మీరంతా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా ఆనందంగావుంది. నేను ఈ స్టేజ్ లో వుండడానికి కారణం రవితేజ అన్నయ్యే. దర్శకుడి గా షాక్ తో జన్మనిచ్చి మిరపకాయ్ తో పునర్జన్మ ఇచ్చింది ఆయనే. అన్నయ్య ఒరిజినల్ పేరు రవిశంకర్ రాజు. ఈ రవి శంకర్ లేకపోతే ఈ హరీష్ శంకర్ లేడు. లవ్ యూ అన్నయ్య.  కొందరు ఎంటర్ టైన్ మెంట్, పాటలు వుంటే సరిపోదని అన్నారు. అలాంటి వారందరికీ గట్టి సమాధానమే ధమాకా కలెక్షన్స్. ఇక్కడితో ధమాకా వేడుకలు మొదలౌతాయి. ఇండస్ట్రీ షాక్ అయ్యే కలెక్షన్స్ పది రోజుల్లో సంతరించుకోబోతుంది. ధమాకా టీం అందరికీ అభినందనలు. ఎన్ని ఒత్తిళ్ళు తో థియేటర్ లోకి అడుగుపెట్టిన ప్రేక్షకుడికి అన్నీ మర్చిపోయేలా చేసే వన్ అండ్ ఓన్లీ హీరో మాస్ మహారాజ్. నా మాటలు గుర్తుపెట్టుకోండి.  ధమాకా సెలబ్రేషన్స్ ఈ రాత్రి నుండే మొదలౌతున్నాయి’’ అన్నారు.   దర్శకుడు  త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. తమ్ముళ్ళు.. మీకు తెలియకుండానే రోజు ధమాకాని మీతో పాటే థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తున్నాను. ధమాకా సమిష్టి కృషి. ఎంతో మంది కష్టపడితే ఈ రోజు ధమాకాని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతమంది పని చేయాలంటే ఒక శక్తి వుండాలి. ఆ శక్తి పేరు.. రవితేజ గారు . ఆయన తీసుకున్న నిర్ణయం ఇంత మందికి పని ఇస్తుంది, అన్నం పెడుతుంది. సినిమాలో భాగమైన అందరి తరపున మాస్ మహారాజా రవితేజ గారికి మరోసారి కృతజ్ఞతలు. ధమాకా ఒక్కరి విజయం కాదు .. మన అందరి విజయం. ధమాకా విజయాన్ని రవితేజ ఫ్యాన్స్ అందరికీ అంకితం చేస్తున్నాను.’’ అన్నారు.   శ్రీలీల మాట్లాడుతూ.. ప్రేక్షకులు, అభిమానులే ధమాకా టైటిల్ కి న్యాయం చేయగలరని  ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. అలాగే మీరు చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ఇండస్ట్రీలో ఇది నా రెండో అడుగు. పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. మీ అభిమానం ఇలానే వుండాలి. రవితేజ గారు బంగారం. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.  దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’’ తెలిపారు.   నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘ధమాకా ని మాసీవ్ బ్లాక్ బస్టర్ చేసిన మాస్ మహారాజా అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రవితేజ గారితో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని ఎదురుచూస్తున్నాం.  త్రినాథరావు, ప్రసన్న, శ్రీలీల..  మా ప్రొడక్షన్ టీం.. ధమాకాకి పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు   కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ..ఆనాడు శ్రీ కృష్ణుడు ఫ్లూటు వాయిస్తే 16 వేలమంది గోపికలు వచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్తికేయ 2 లో కూడా ఒక ఫ్లూట్ వుంది. ఆ ఫ్లూట్ తో ఏం ఊదారో గానీ డబ్బులే డబ్బులు (నవ్వుతూ). రవితేజ డ్రమ్ము వాయిస్తేనే ఆ రోజుల్లో అల్లరి ప్రియుడు 250 రోజులు ఆడింది. ఇప్పుడు డ్రమ్ము వాయిస్తే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దర్శకుడు త్రినాథరావు డిజైన్ చేసిన రావు రమేష్, ఆది ట్రాక్  ధమాకే కొత్త కోటింగ్ తీసుకొచ్చింది. రవితేజ ఎవర్ గ్రీన్. శ్రీలీలతో పాటు ధమాకా టీం అందరికీ కంగ్రాట్స్” తెలిపారు.   ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఎప్పుడు వస్తుందని అడగని సినిమా ధమాకా. ప్రతి వాళ్ళు థియేటర్ లో వెళ్లి ధమాకా చూస్తున్నారు. నాలుగు రేటింగు వచ్చే సినిమా రాయొచ్చు, ఐదు వందల కోట్లు వచ్చే సినిమా రాయొచ్చు. కానీ ప్రేక్షకులు తెరమీదకు వెళ్లి షర్టులు విప్పి డ్యాన్సులు చేసే మళ్ళీ ఇంలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తామేమో తెలీదు. ఈ మ్యాజిక్ కి కారణం రవితేజ అన్న ఫ్యాన్స్. ధమాకని బ్లాక్ బస్టర్ చేసింది ఆయన అభిమానులే. ఈ సినిమా అవకాశం ఇచ్చిన రవితేజ గారికి పీపుల్ మీడియాకి కృతజ్ఞతలు. ఈ యేడాది చివర్లో ఒక జెండా ఎగరబోతుంది దాని పేరు ధమాకా అని  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పా. ఆ జెండాని ఎగరేసిన మీ అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.   భీమ్స్ సిసిరిలియో మాట్లాడుతూ.. మీ అందరికీ రుణపడి వుంటాను. రవితేజ గారితో పని చేయాలనీ నేను కల మాత్రమే కన్నాను. మీరంతా కోరుకున్నారు. అందుకే ఆరేళ్ళ తర్వాత ఐసియూ లో పేషెంట్ లా వున్న నన్ను తన రెండు భుజాల మీద ఎత్తి ప్రజల సమక్షంలో ఒక జాతీయ జెండా లా ...
  •     Hon’ble President of India Smt. Droupadi Murmu ji, accompanied by Hon’ble Governor of Telangana State, Dr. Tamilisai Soundararajan, participates in “Azadi Ka ...
  • శ్రీమతి దర్శన విక్రమ్‌ జర్దోష్‌, వస్త్ర మంత్రిత్వ శాఖ, రైల్వే  శాఖ సహాయ మంత్రి, భారత ప్రభుత్వము గారు ఈరోజు (ది. 29.12.2022) రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ డాక్టర్ (శ్రీమతి) ...
  • తన వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామగారు పాకాల హరినాథరావు మృత్రపట్ల ముఖ్యమంత్ర ికె. చంద్ిశేఖ్ర్ రావు తీవ ిసంతాపాన్ని వయకతం చేశారు. హ ైద్రాబాద్ లోన్న రాయ్ద్ురగం వద్ద గల వారి ...
  • ‘Ho Egire’ lyrical video from ‘Kalyanam Kamaneeyam’ released Young hero Santosh Shoban is doing ‘Kalyanam Kamaneeyam’. Kollywood star Priya Bhavani Shankar is its heroine. ...
  • *2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుంది – నిఖిల్* కార్తికేయ-2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్ మరియు అనుపమ ...