Collo Collo Koila Song Lyrical Video Released From Itlumaredumilli Prajanikam

అల్లరి నరేష్, ఏఆర్ మోహన్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నుండి కోలో కోలో కోయిలా సాంగ్ లిరికల్ వీడియో విడుదల
వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతోంది. అన్ని కార్యక్రమాలతో పాటు సెన్సార్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికేట్‌ను పొందింది. ఇదిలావుండగా చిత్రం నుండి ‘కోలో కోలో కోయిలా’ సాంగ్ లిరికల్ వీడియోను నిర్మాతలు విడుదల చేశారు.
మారేడుమిల్లి వాసుల సంబరాలను ఈ పాట కన్నుల పండువగా ఆవిష్కరించింది. తమ జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నించే అల్లరి నరేష్ కు గ్రామస్తులు ఘనస్వాగతం పలకడంతో పాట ప్రారంభమవుతుంది. దేవుడిని ప్రార్థించడమే కాకుండా, ఆఫీసర్ చేసిన అన్ని మంచి పనులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీచరణ్ పాకాల అందించిన పాట ఫోక్ బీట్ లతో చాలా ఎనర్జిటిక్ గా ఉంది. జావేద్ అలీ, మోహన భోగరాజు , యామిని ఘంటసాల ఈ పాటని హుషారుగా ఆలపించగా , కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.
అల్లరి నరేష్ తెల్ల చొక్కా, పంచెలో కనిపించారు. ఈ పాటకు అల్లరి నరేష్ చేసిన డ్యాన్సులు అద్భుతంగా ఉన్నాయి. ఆనంది హాఫ్ శారీలో అందంగా కనిపించింది.
ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాంరెడ్డి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్
నిర్మాత: రాజేష్ దండా
నిర్మాణం: హాస్య మూవీస్, జీ స్టూడియోస్
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డైలాగ్స్: అబ్బూరి రవి
డీవోపీ: రాంరెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
స్టంట్స్: పృథ్వీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ
డిఐ – అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో: వంశీ-శేఖర్