Evarikee Cheppoddu Hero Rakesh Varre Interview
*Interview: Rakesh Varre*
Evvariki Cheppoddu’ is running to packed houses: Rakesh Varre
Rakesh Varre, the producer and hero of ‘Evvariki Cheppoddu’, started out by playing a small role in the film ‘Josh’ way back in 2009. After acting in films like ‘Vedam’, ‘Badrinath’, ‘Mirchi’, ‘Baahubali’, and ‘Goodachari’, he has struck gold with ‘Evariki Choppoddu’. A sensible film that offers plenty of laughs and a nice message, this one is doing very well at the box-office. In this interview, catch the talented youngster talk about his journey in the film industry, how the film came to impress Dil Raju, his association with ‘Baahubali’ and more.
What kind of feedback are you receiving for ‘Evvariki Cheppoddu’?
The feedback has been very good. Since our film released on a festival day and it was a Tuesday, we had been a bit skeptical. But, thankfully, the film has been running to packed houses in multiplexes. Single screens are registering 65% occupancy. Mass crowds have come down but the rest of the sections are impressed thoroughly. College students are expected to watch the film in big numbers in the coming days.
How did Dil Raju come to acquire the film?
Dil Raju garu knew that the film will connect with family and youth audiences. More than youths, families are watching in bigger numbers. It was Raju garu who had introduced me in ‘Josh’. I kept in touch with him over the years. This story was first taken to Raju garu. Since time didn’t permit him, he recommended it to some other person. He advised me not to produce the movie myself. But I decided to eventually produce the movie myself because nobody was willing to produce it for two reasons: I am relatively new, and caste is a sensitive issue. But we knew that the treatment is sensible and careful. After the film was made, Raju garu watched the movie and told me the release strategy has to be planned with care.
How do you see caste and how does the film deal with the sensitive subject?
Caste has always been part of my surroundings. Intra-caste marriages, etc are a given. To be frank, I have never cared much about caste. I don’t identify with the identity. Our film doesn’t target any caste. It’s neutral yet open and frank.
How was it possible to make the film on a low budget?
We have made it honestly. For authenticity, we shot the Kalahasthi scenes in Kalahasthi itself. Audience are smart nowadays and they don’t accept fake locations. Given budgetary constraints, I had to rely on my contacts to reduce the costs. For the song shot at the Himalayas, we planned how it can be shot in a short time. We traveled by train and buses and not flights. People in the industry helped me a lot in this regard.
How did this film fall into place?
After ‘Baahubali’, I was determined to make a good film myself. I had been to the New York Film Academy and learned filmmaking there for a year. With knowledge and experience, I became confident to make a film. I then came here and listened to 47 scripts. I looked for performance-oriented roles. I came to know about Basava Shankar, who by then had locked two films. I requested him to keep me in mind. I showed him my showreels. A couple of months later, he came to me with an offer.
Did you always want to be an actor?
I used to admire Chiranjeevi garu, Pawan Kalyan garu, among others, to turn an actor. The Megastar influenced me to become an actor with his movies like ‘Jagadeka Veerudu Athiloka Sundari’. As years passed, my passion to become an actor grew stronger and stronger. Academics and conventional career choices never excited me.
How did big films like ‘Baahubali’ happen to you?
I don’t come from a film background. I had no clue how to attend auditions, etc. It was a challenge for me and I had to chase roles. Big films were always difficult. I tried for negative roles since no one wanted to cast me as a male lead. Villains are highlighted in our movies. ‘Badrinath’, for example, was a big thing for me. I had sent VV Vinayak garu a short showreel, which impressed him. It stood out amongst all the profiles. For ‘Baahubali’, too, I did a showreel of Ashwatthama from the epic Mahabharatham. I used to do showreels of my martial arts demos and send them to Rajamouli garu through Valli garu and Rama garu. My attempts to work with Rajamouli garu failed for years. After ‘Mirchi’, I went to Rama garu and told her I won’t do any film until ‘Baahubali’ gets completed if I get chosen for a role. That film became a two-part series. Since my look for the films was different, I couldn’t do any other film during those years. I read books related to filmmaking and later went to New York after taking permission from Valli garu.
What did you do after completing ‘Evvariki Cheppoddu’? Did you show it to industry people?
‘Goodachari’ director, ‘Agent Sai Srinivas Athreya’ director, ‘Care Of Kancharapalem’ director, Venky Atluri and others watched the movie. The young directors totally loved the movie but I wanted to show it to Koratala Siva garu and Sukumar garu too. Thankfully, both the directors said the movie is really good. They also said that it will be a hit. They asked me to take steps to ensure that it becomes a blockbuster.
What next for you?
I want to do hero roles provided the roles are challenging. I have not signed any movie so far.
*’ఎవ్వరికీ చెప్పొద్దు’ హీరో, నిర్మాత రాకేశ్ వర్రె ఇంటర్వ్యూ.*
రాకేశ్ వర్రె హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో గార్గేయి ఎల్లాప్రగడ హీరోయిన్. బసవ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై అక్టోబర్ 8న దిల్‌రాజు ఈ సినిమా విడుదల చేశారు. ప్రేక్షకుల నుండి సినిమా చక్కటి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా రాకేశ్ వర్రెతో ఇంటర్వ్యూ…
*ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది?*
చాలా బాగుంది. మంగళవారం.. అదీ పండుగ రోజున సినిమాను విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు వస్తారో రారో అనుకున్నాను. నేను అయితే పండుగ రోజున బయటకు వెళ్ళను. మా సినిమాకు పండగ రోజు నుంచి హిట్ టాక్ వచ్చింది. థియేటర్లలో 60-70 ఆక్యుపెన్సీ ఉంది. తర్వాతి రోజు నుంచి హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఇది నిజమా? అని నేనే నమ్మలేకపోయాను. ఇప్పటికీ మల్టీప్లెక్స్ లలో హౌస్ ఫుల్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 60-75% ఆక్యుపెన్సీ ఉంటుంది. శనివారం శివ పార్వతి థియేటర్ కు వెళ్లాను. థియేటర్ కెపాసిటీ 1000. 800 మంది వరకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది.
*సినిమా జానర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసినట్టు ఉన్నాయి!*
అవునండి. థియేటర్లకు వెళితే అక్కడి సిబ్బంది సోమవారం నుండి కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారని చెబుతున్నారు. కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ బంక్ కొట్టి సినిమా చూస్తారు కదా! ఫ్యామిలీ, యూత్ ఇష్టపడే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంది. ముందు యూత్ చూస్తారని అనుకున్నాను. పని థియేటర్లకు ఫ్యామిలీలు వచ్చాయి. సెలవులు అయ్యాక యూత్ అందరూ కలిసి సినిమాకు వస్తారని అనుకుంటున్నా.
*దిల్ రాజు గారు సినిమా విడుదల చేశారు. ఆయన్ను ఎలా ఒప్పించారు?*
జోష్ సినిమాతో నటుడిగా నన్ను పరిచయం చేసింది ఆయనే. తర్వాత నేను సినిమాలు చేసుకుంటూ ఉన్నాను. మధ్యలో అప్ డేట్స్ ఇస్తూ ఉండేవాణ్ణి. తర్వాత బాహుబలి చేశాను. అది చేశాక ఇటువంటి సినిమాలు చేయాలనిపించింది. కానీ అంత బడ్జెట్ సినిమాలు చేయాలేం. తక్కువ బడ్జెట్ లో ఆ స్టాండర్డ్ సినిమాలు చేయాలి అనుకున్నాను. అప్పుడు ఎవరికీ చెప్పొద్దు కథ విన్నాను. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ముందు రాజుగారి దగ్గరికి వెళ్లాను. కథ వినమని. ఆయనకు టైం సరిపోక వేరేవాళ్లను వినమన్నారు. కానీ, సినిమా స్టార్ట్ కావడం లేదు. ’నువ్వు ఏమైనా చెయ్ కానీ ప్రొడ్యూస్ చేయకు’ అని రాజుగారు చెప్పారు. నేను చాలా మంది నిర్మాతలు దగ్గరకు తిరిగాను. ప్రొడ్యూస్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. బహుశా… క్యాస్ట్ అనేది సెన్సిటివ్ ఇష్యూ కావడంతో ముందుకు రాలేదేమో. దాంతో నేనే ప్రొడ్యూస్ చేసేశాను. మళ్లీ రాజుగారి దగ్గరికి వచ్చాను. సినిమా చూపించాను. ‘ఎందుకు ప్రొడ్యూస్ చేసావ్’ అన్న ముందు రెండు మూడు తిట్లు తిట్టారు. తర్వాత ‘మంచి సినిమా ఒక ప్లాన్ ప్రకారం విడుదల చేయాలి’ అన్నారు. అలా థియేటర్లలోకి వచ్చింది.
*దర్శకుడు బసవ శంకర్ మీకు ఎలా పరిచయం?*
‘బాహుబలి’ మధ్యలో ఫిలిం మేకింగ్ కోర్స్ చేయాలని న్యూ యార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్లాను. ఏడాది అక్కడ ఉన్నాను. తిరిగొచ్చాక ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నా. అప్పటికే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల లో నటుడిగా చేయడంతో దర్శకత్వ శాఖలో చాలామంది నాకు తెలుసు. అందరికీ నేను ఫోనులు చేసేవాడిని… మీ దగ్గర ఏమైనా స్క్రిప్టు ఉంటే నాకు చెప్పండి అని. ఎవరు నా దగ్గరికి రారు, నేనే వాళ్ళ వెనకాల పడాలి అని నాకు తెలుసు. 47 కథలు విన్నాను. ప్రతి కథ విన్న తర్వాత ఏది బాగుంది ఏది బాగులేదో రాసుకునే వాడిని. అప్పటికే శంకర్ కథను ఒక ప్రొడక్షన్ హౌస్ ఓకే చేసింది. ఇద్దరు ముగ్గురు హీరోలు రెడీగా ఉన్నారు. అతను వెరీ టాలెంటెడ్ అని విన్నాను. దాంతో అతని వెనక పడ్డాను. ఆల్రెడీ నేను ఓ ప్రొడక్షన్ హౌస్ కి కమిట్మెంట్ ఇచ్చాను. బయటకు రాలేను అని చెప్పాడు. ఒకవేళ అవి ఏవి కాకపోతే నన్ను ఒక ఆప్షన్ కింద పెట్టుకోమని చెప్పాను. కొన్ని నెలల తర్వాత తనే ఫోన్ చేశాడు. కథ చెబుతాను నచ్చితే చేయమని అన్నాడు. ఎవరికీ చెప్పొద్దు కథ నచ్చింది వెంటనే చేసా.
*క్యాస్ట్ ఫీలింగ్ బేస్డ్ కథ. ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆలోచించారా*
సినిమాలో మేం ఏ క్యాస్ట్ ను చేయలేదు. న్యూట్రల్ గా, ఫన్నీగా చెప్పాం. అయినా కొంత రిస్క్ ఉంటుందని తెలుసు. రిస్క్ తీసుకుని చెశా.
*ఇంతకు ముందు మీరు ఏయే సినిమాలో నటించారు?*
జోష్, వేదం, బద్రీనాథ్, మిర్చి, బాహుబలి, జై లవకుశ, గూడచారి.
‘ఎవరికీ చెప్పొద్దు’తో హీరోగా పరిచయం అయ్యా.
*యాక్టర్ కావాలని మీకు ఎప్పుడు అనిపించింది? మీ ఇన్స్పిరేషన్ ఎవరు?*
చిరంజీవి గారు, పవన్ కల్యాణ్ గారు. చిన్నప్పటినుండి చిరంజీవి గారు నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసేవారు. నేను చూసిన ఫస్ట్ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి. 50, 60 సార్లు ఆ సినిమా చూసి ఉంటాను. నాపై ఆ సినిమా బలమైన ప్రభావం చూపించింది. నాకు తెలియకుండా హీరో కావాలనే కోరిక బలపడింది.
*’బాహుబలి’ చేయడం వల్ల, ఆ సినిమాకు ఎక్కువ డేట్స్ ఇవ్వడం వల్ల మీరు హీరోగా పరిచయం కావడం ఆలస్యమైందా?*
నాకు ఎప్పటి నుండో రాజమౌళి గారితో చేయాలని ఉండేది. కరెక్ట్ టైమింగ్ ఉండేది కాదు. నేను వెళ్లి కలిసే టైం కి ఆయన సినిమా స్టార్ట్ అయ్యేది. లేదా ఆడిషన్స్ అయిపోయేవి. ప్రతిసారి వెళ్తూ ఉండడంతో వల్లి రమా గారు బాగా పరిచయం అయ్యారు. మిర్చిలో ప్రభాస్ గారితో నటించాను. అప్పుడే కంపల్సరీ రాజమౌళి గారితో పని చేయాలని ఫిక్స్ అయ్యా. ఆయన దగ్గరికి వెళ్లి మీ సినిమా ఎవరకు వేరే సినిమా చేయను అని ప్రామిస్ చేశా. అప్పటికి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఒక పార్ట్ అనుకున్నారు. ఒక షెడ్యూల్ చేసిన తర్వాత రెండు పార్ట్స్ గా అనుకున్నారు. మధ్యలో వేరే సినిమా చేద్దామనుకుంటే డేట్స్ క్లాష్ అవుతున్నాయి. మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఫిలిం మేకింగ్ బుక్స్ చదివా. మధ్యలో న్యూయార్క్ ఫిలిం అకాడమీ వెళ్లా.
*ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?*
హీరోగా చేయాలని అనుకుంటున్నాను. అలాగే మంచి విలన్ రోల్స్ వచ్చినా చేస్తా