Full length entertainer with Satyam Rajesh as hero

సత్యం రాజేష్ హీరోగా ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ !!!
తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యం రాజేష్ హీరోగా మధు సూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా డిసెంబర్ 21న లాంఛనంగా ప్రారంభం కానుంది.

ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్ ఉండబోతున్నాయి. రుద్రవీణ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మధుసూదన్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడం విశేషం.
రియా సచ్చదేవా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు నోటెడ్ ఆర్టిస్ట్స్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి.
మంచి కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని రూపొందిందబడుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేయనున్నారు.