George Reddy Adugu Adugu song launch by Chiranjeevi
‘‘జార్జ్ రెడ్డి ’’ సినిమాను అందరూ చూడాలని కోెరుకుంటున్నా – మెగాస్టార్ చిరంజీవి
విద్యార్థి విప్లవోద్యమ నాయకుడు జార్జిరెడ్డి కథతో తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. ఈ నెల 22న విడుదల కాబోతోన్న ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.
జార్జిరెడ్డి అనే పేరుతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. అలాగే సినిమాలో కీలకంగా వచ్చే ‘అడుగడగుడు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు’అనే పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నేను ఒంగోలులో ఇంటర్మీడియొట్ చదువుకుంటున్నప్పుడు మొదటిసారి జార్జిరెడ్డి గురించి విన్నాను. ఇన్నాళ్లకు మీ సినిమా జార్జిరెడ్డి ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే మీ సినిమా ద్వారా మరోసారి వింటున్నాను. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. మార్పు కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన. తప్పును ప్రశ్నించే అలాంటి వాళ్లు అక్కడి నుంచి ఇంకా చాలామంది వచ్చారు. ఈ పాట చూసిన తర్వాత నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. జార్జిరెడ్డి ఎలాంటి ఆశయాలతో ఉండేవాడు.. ఏ రివల్యూషనరీ థాట్స్ ఎలా ఉండేవి.. తప్పును ప్రశ్నించడం కోసం విద్యార్థి సంఘాలను పెట్టి అన్యాయాలను ఎదుర్కొన్నాడు అనేది ఈ పాటతో తెలుస్తుంది.అలాగే సినిమాను కూడా చాలా చక్కగా తీశారు. ఇలాంటి సినిమాలు రావాలి. జార్జిరెడ్డి బాటలో ఈ యూనివర్శిటీ నుంచి చాలామంది వచ్చారు. జార్జిరెడ్డి వంటి అగ్రెసివ్ వ్యక్తుల కథలు ఇంకా రావాలి. ఈ సినిమా మీ అందరూ చూడాలని కోరుకుంటున్నాను.. ఇంత మంచి సినిమా తీసిన యంగ్ టీమ్ దర్శకుడు జీవన్ రెడ్డి, డివోపి సుధాకర్ రెడ్డి, ,నిర్మాతలు సంజయ్ రెడ్డి, అప్పిరెడ్డి,డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’అన్నారు.
ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ సినిమా కోసం పరిశ్రమ మొత్తంగా ఆసక్తిగా చూస్తోంది. .
‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్
మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీమంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
జార్జిరెడ్డిగా సందీప్ మాధవ్ నటించిన ఈ మూవీలో ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ ప్రధాన పాత్రలో నటించాడు. ఇతర పాత్రల్లో ముస్కాన్,మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్,మహాతి ఇతర నటీనటులు.
సాంకేతికవర్గానికి విషయానికి వస్తే
సంగీతం -సురేష్ బొబ్బిలి,
ఎడిటింగ్- ప్రతాప్ కుమార్,
ఆర్ట్- గాంధీ నడికుడికార్,
కాస్టూమ్స్- సంజనా శ్రీనివాస్,
ఫైట్స్ -గణేష్, ఆర్కే,
అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్.
స్టిల్స్ -వికాస్ సీగు,
సౌండ్ డిజైన్-ఖలీష,రాహుల్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్- హర్షవర్ధన్ రామేశ్వర్
పి ఆర్ వో: జిఎస్ కె మీడియా
కో డైరెక్టర్ -నరసింహారావు,
అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.
కో ప్రొడ్యూసర్: సంజయ్ రెడ్డి
నిర్మాత: అప్పిరెడ్డి
రచన-దర్శకత్వం- జీవన్ రెడ్డి.