Introducing Tharun Bhascker As Balaji In Sita Ramam
Introducing Tharun Bhascker As Balaji In Dulquer Salmaan and Hanu Raghavapudi’s Sita Ramam
The film Sita Ramam is an epic love story set in war backdrop. Dulquer Salmaan and Mrunal Thakur are the lead pair in the movie directed by Hanu Raghavapudi. Besides making the movie lavishly, the makers roped in popular actors for crucial roles. The film indeed is turning big with introduction of every actor.
While Rashmika Mandanna is playing a heroic role as Afreen, Sumanth will be seen as Brigadier Vishnu Sharma. Today, they have introduced Tharun Bhascker’s character as Balaji. Looks trendy, Tharun Bhascker can be seen drinking a soft drink. The glimpse released by the makers show Tharun introducing himself saying, “Balaji Hainaa.. Sab Sambhal Lega…” (Balaji will take care of everything).
The casting choices shows the kind of care the makers had taken for the movie.
Aswini Dutt is producing this highly anticipated movie under Swapna Cinema, while Vyjayanthi Movies presents it. Vishal Chandrashekhar has provided music for the movie that has cinematography by PS Vinod.
The film being made simultaneously in Telugu, Tamil and Malayalam languages will hit the screens on August 5th.
యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టొరీ ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు. ప్రతి పాత్ర వినూత్నంగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ పాత్రను బాలాజీగా పరిచయం చేశారు. ఈ లుక్ లో కూల్ డ్రింక్ తాగుతున్న తరుణ్ భాస్కర్ చాలా ట్రెండీగా కనిపించారు.
బాలాజీ పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో కూడా ఆసక్తికరంగా వుంది. ”బాలాజీ హై నా.. సబ్ సంభాల్ లేగా(బాలాజీ వున్నాడు.. అంతా చూసుకుంటాడు) అని తరుణ్ భాస్కర్ చెప్పిన డైలాగ్ ఆయన పాత్రపై క్యూరియాసిటీని పెంచింది. ‘సీతారామం’లోప్రతి పాత్ర కోసం మేకర్స్ తీసుకున్న శ్రద్ధ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్దమౌతుంది.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.