K s Ravi kumar interview photos

కథకు జైసింహా కు కూడా సంబంధం లేదు – కె.ఎస్ రవికుమార్
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె. ఎస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహా తరువాత వస్తున్న చిత్రం రూలర్,ఈ నెల 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా దర్శకుడు కె.ఎస్ రవికుమార్ మీడియాతో మాట్లాడారు.
బాలకృష్ణ గారితో సినిమా అనగానే ఏమైనా అంశాలు జోడించి చేస్తారా.?
అవునండీ,ఏ హీరో కు ఎలాంటి ఇమేజ్ ఉంది,ఆ హీరో ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఏ కథ సెట్ ఆలోచించి చేస్తాం.
బ్యాక్ టూ బ్యాక్ బాలయ్య గారితో సినిమా చేశారు.?
అవునండీ ఫిలిమ్స్ వచ్చాయి తమిళ్ లో చిన్న సినిమాలు వచ్చాయి, ఈ ఏజ్ లో మళ్ళీ చిన్న సినిమాలు ఏంటి, కాంపిటీషన్ బాగుంది చిన్న సినిమాలకు,రజినీ గారు కూడా చెప్పారు వెయిట్ చెయ్యండి పెద్ద సినిమా వస్తుంది అని,ఈ లోపు యాక్టింగ్ చేసాను కొన్ని సినిమాల్లో అక్కడ,ఇక్కడ మళ్ళీ డైరెక్షన్.
బాలకృష్ణ గారి ఇమేజ్ తగ్గట్టుగా ఏమి చేశారు ఈ సినిమాలో.?
ఆయనకు మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది,అది దృష్టిలో పెట్టుకున్న కానీ ఈ సినిమా ఓన్లీ మాస్ కి మాత్రమే కాదు అందరికీ నచ్చుతుంది.
అసురన్ లాంటి సినిమాలు చేస్తారా మీరు.?
ఏ సినిమా అయినా తీయొచ్చు, కానీ నా సినిమాలో అన్ని ఉండాలి అనుకుంటాను,ప్రొడ్యూసర్స్ వస్తే రావాలి కదా,నేను కమర్షియల్ ఫిల్మ్ నే టేస్ట్ గా తీయాలనుకుంటునాను.