Ramgopal Varma press meet
సెన్సార్ బోర్డ్ మీద సినిమా తీస్తా అతి త్వరలో – రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈ సినిమా పైన చాలా కేసులు నమోదయ్యాయి ముందుగా ఈ సినిమా టైటిల్ విషయంలో అభ్యంతరాలు రావడంతో ఆ సినిమా టైటిల్ ని అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని మార్చాడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా 29న రిలీజ్ కావల్సిఉండగా ఈ సినిమా విషయంలో వివాదాలు తలెత్తడంలో ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది.
ఈ సందర్భంగా దర్శకుడు వర్మ మీడియాతో మాట్లాడారు.
సినిమా రిలీజ్ అనేది ఆగింది కథ సినిమా లో ఎటువంటి మార్పులు చేస్తారు.?
సినిమాలో మార్పులు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేదండి ఎందుకంటే ఒక కులాన్నీ గాని ఒక వర్గాన్ని గాని ఈ సినిమాలో తక్కువ చేయలేదు.అటువంటి మార్పులు ఏమి ఉండవు.
టైటిల్ అయితే మార్చారు గాని ఇంకా లిరిక్ మాత్రం అలానే ఉంది.?
అది సౌండ్‌ట్రాక్ లో చెయ్యాలి అండి ఇంకా,అది ఫైనల్ ఔట్ పుట్ లో ఉండదు.
సినిమాలో పాత్రలు అన్నీ కో-ఇన్సిడెన్స్ గా జరిగాయి కానీ కేఏపాల్ మాత్రం నిజంగానే ఇన్స్పైర్ అయి చేశాను అన్నారు .?
అది నేను జోక్ గా అన్నాను.
కె.ఏ పాల్ మాత్రం ఏమైనా సీరియస్ గా తీసుకున్నారు.?
కే.ఏ పాల్ ని ఆయనే సీరియస్ గా తీసుకోడు ఇంక నేను ఎలా తీసుకుంటా….
ఎలక్షన్స్ ముందు అబ్జర్వ్ చేస్తే అన్ని ఛానల్స్ లో కూర్చొని అందరిని తిట్టడం పనిగా పెట్టుకుని అందరినీ కించపరిచిన కే ఏ పాల్ ఇప్పుడు అతన్నే కించపరుస్తున్న అని చెప్పడం హాస్యాస్పదం.
రిలీజ్ కి ఒక్క రోజు ముందే సినిమా ఆగిపోవడం ఏంటి మీరు సినిమా విషయంలో ప్లానింగ్ చేసుకోలేదా.?
కంప్లీట్ గా సెన్సార్ చెప్పిన రూల్స్ పాటిస్తే నాకు తెలిసి ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వదు,
కానీ ఈ ఒక్క సినిమాకి మొత్తం రూల్ బుక్ అనేది తీసి చూడటం వెనుక ఉద్దేశ్యం ఏంటి అనేది ఆయనకే తెలియాలి. అది వేరే విషయం.సినిమా విషయంలో మాత్రం రిలీజ్ ప్లానింగ్ కరెక్ట్ గానే ఉంది బట్ అనుకోకుండా ఇలా జరిగింది.
గవర్నమెంట్ నుండి మీకు మంచి సపోర్ట్ ఉంది కదా కానీ సినిమా రిలీజ్ ఎందుకు ఆగింది.?
గవర్నమెంట్ నుండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సెన్సార్ బోర్డ్ మెంబర్ ఒకాయన ఆబ్జెక్ట్ చేశారు ఇంకా ఇంద్రసేన చౌదరి అనే ఒక ఆయన అంతే.
గవర్నమెంట్ నుంచి వచ్చింది ఏంటి అంటే ఇలాంటి టైటిల్ వలన కరెక్ట్ కాదు వివాదాలకు దారితీస్తోంది అనేది మాకు అనిపించింది అందుకు టైటిల్ మార్చడం జరిగింది.
వాల్మీకి అనే సినిమా టైటిల్ వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బ తింటే మీరు ఏకంగా మనుషుల్ని దించేశారు.?
ఎవరికైతే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారో వాడు కూడా ఇంకొకరి మనోభావాలను దెబ్బతీసిన వాడే అసలు వాక్ స్వాతంత్రం అంటేనే అవతల వాడిని హర్ట్ చేయడానికి లేకపోతే మనకు వాక్ స్వాతంత్రం అవసరం ఏముంది.
అప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో ఇలాంటి గొడవలు జరిగితే మీరు పర్సనల్ గా తీసుకొని బాగా హర్ట్ అయ్యారు ఇప్పుడు చూస్తే బాగా లైట్ గా కనిపిస్తున్నారు అలవాటైపోయిందా.?
నా జీవితంలో ఎప్పుడు ఒకరిని ప్రేమించడానికి ఇంకొకరిని ద్వేషించడానికి టైం వేస్ట్ చేయను.
ఈ సినిమా ద్వారా వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీ పోస్టర్లో చూపించినట్టు.?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు,ఎవరు ఎప్పుడు కలుస్తారో కూడా తెలియదు రోజుకొకలా మారిపోతుంటాయి నేను మాత్రం పర్సనల్ గా ఈ సినిమాని సీరియస్ గా తీసుకుంటున్నాను.
ఈ కోర్టులు కేసులు అని కాకుండా ఈ సినిమా వెబ్ లో ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా.?
వెబ్ లో రిలీజ్ చేసే అవకాశం లేదండి డెఫినెట్ గా థియేటర్లో ఈ సినిమా వస్తుంది.
సెన్సార్ మీద ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా.?
తీస్తాను,అతి త్వరలో…..
ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని మీరు చెప్తున్నారు కదా ఈ సినిమా ద్వారా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు.?
దేన్ని సీరియస్ గా తీసుకోకూడదు అని మెసేజ్ ఇస్తున్నాను.
నేను ఎలాంటి వాడిని అంటే ఎంత గట్టిగా కింద పడేస్తే అంత పైకి లేస్తాను అందుకే ఈ సినిమాకి సీక్వెల్ కూడా చేస్తాను.
సీక్వెల్ లో సీఎం మారతాడా.?
యస్,
రాజధాని కూడా మారొచ్చు అప్పుడు కడప కి వెళ్లొచ్చు.
ప్రొడ్యూసర్ అజయ్ మైసూరు మాట్లాడుతూ…..
ఈ సినిమా సార్ చెప్పినప్పుడు ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు ఎవరి మనోభావాలు దెబ్బ తినవు,
ఇది సార్ చెప్పినట్లు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం.
ఫస్ట్ టైం సార్ మెసేజ్ ఓరియంటెడ్ చేస్తున్నారు…..