Shalini interview photos
షాలినీ మాట్లాడుతూ, మా అమ్మగారిది మొగల్తూర్, నాన్నది హైదరాబాద్. నేను ఇక్కడే పెరిగాను. అయితే సినిమాలపై ఆసక్తి ఎక్కువ. అందుకే తమిళ షార్ట్ ఫిలిం చేశాను. ఆ తర్వాత కొన్ని రెస్టారెంట్ యాడ్స్ కూడా చేశాను.
– పాండమిక్ టైంలో కొంత గ్యాప్ వచ్చింది. జయమ్మ.. సినిమాకు పనిచేస్తున్న రచయిత నన్ను ఇందులో పాత్రకు ప్రిఫర్ చేశారు. దర్శకుడు ఆడిషన్ ద్వారా ఎంపిక చేశారు.
– బేసిగ్గా నా పాత్ర వేరే ఊరునుంచి శ్రీకాకుళం వస్తుంది కాబట్టి నాకు యాస పలికే అవకాశం పెద్దగా వుండదు. కానీ మిగిలిన పాత్రలన్నీ చక్కగా యాసతో మాట్లాడారు.
– నా పాత్రకూ జయమ్మకు పెద్దగా సన్నివేశాలు వుండవు. కానీ మా లవ్ స్టోరీకి జయమ్మకు వచ్చిన సమస్యకూ లింక్ వుంటుంది. అది సినిమాలో ఆసక్తికరంగా వుంటుంది.
– శ్రీకాకుళం, ఆముదాలవలస, పాలకొండ, కోటిపల్లి వంటి ప్రాంతాల్లో షూటింగ్ తీశారు. లొకేషన్లు చాలా సుందరంగా వున్నాయి.
-ఇందులో నా రియల్ లైఫ్‌కు వ్యతిరేకమైన పాత్ర పోషించాను. పాత్ర అందరూ మెచ్చుకునేలా వుంటుంది. నటిగా నాకు గుర్తింపు వస్తుందనే నమ్ముతున్నాను.. అని చెప్పారు.
no images were found