Software Sudheer success meet
Thanks To The Audience And Fans Who Embraced Me On The Big Screen Too – Sudigali Sudheer At ‘Software Sudheer’ Success Meet
Sudigaali Sudheer. Dhanya Balakrishna starrer ‘Software Sudheer’
Hero Sudigali Sudheer said, ” I never thought in my life that I will do a character of two hours duration on the big screen. It became true today. The audience usually watches me three times a week on their TV. Thanks to each and everyone who is buying a ticket and watching my film in theatres. I am indebted to all of you. The film has received positive talk since it’s release. It is because of big technicians who worked for this film, It has reached to next level. Our Director went to Tirupathi to offer prayers as the film has got a positive talk on its first day. Thanks to everyone on behalf of him.”
I Changed My Name To Software Sekhar Raju Marking The Success Of This Film
Producer Software Sekhar Raju said, ” I am grateful to the audience for making my film a success. This film is dedicated to Siva Prasad garu who liked the story and has acted in this film without taking any remuneration. Our film released in 190 theatres on its first day. Now it is running in 300 theatres. It has grossed 4 Crore 50 lakhs in two days. Distributors said that they are increasing the theatres. I changed my name as Software Sekhar Raju marking the success of this film.”
Heroine Dhanya Balakrishna said, ” We thought that this film will take a normal opening but, Sudheer fans have celebrated and gave this film a flying start along with the audience. The film is having a good run with very good moth publicity. Along with the Telugu states, the film is getting very good collections in Karnataka too. Very happy to score a good hit at the end of this year. Thanks to the audience and Sudheer fans for making this film a good success.”
Music Director Bheems said, ” I am proud of being a part of ‘Software Sudheer’. When we visited theatres, It was like a big meeting with all the whistles and claps. Everyone will feel goosebumps watching Sudheer anna and Dhanya dancing for my songs. Sudheer garu made my music work in the film. The film which was released in 200 screens is currently running in 300 screens. this marks the success of this film. Thanks to Producer Sekhar Raju garu and my friend Rajasekhar for making such a good film. Suresh Upadhyaya has penned three songs in this film. ‘Intha Andame’ song became a big hit. I wish him a good career ahead.”
Lyricist Suresh Upadhyaya said, ” I have written three songs in this film and all of them became a good hit. Sudheer anna has rocked with his dances. Thanks to Sekhar Raju garu, Director Rajasekhar garu and Bheems for this opportunity.”
Nizam Distributor Paper Satyanarayana said, ” We have released this film in 190 theatres initially. Now it is running in 300 theatres. More theatres will be added.
బిగ్ స్క్రీన్ మీద కూడా హీరోగా నన్ను అపూర్వంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు – ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సక్సెస్ మీట్ లో హీరో సుడిగాలి సుధీర్.
సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ హీరో హీరోయిన్స్ గా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్‌పై సాఫ్ట్వేర్ శేఖర్ రాజు నిర్మించిన చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్స. డిసెంబర్ 28న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలై అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా డిసెంబర్ 30న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో హీరో సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ, నిర్మాత సాఫ్ట్వేర్ శేఖర్ రాజు, సంగీత దర్శకుడు భీమ్స్, లిరిసిస్ట్ సురేష్ ఉపాధ్యాయ, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ పాల్గొన్నారు..
హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ – “వెండితెర మీద కంటిన్యూ గా రెండు గంటలపాటు ఉండే క్యారెక్టర్ చేస్తానని నా లైఫ్ లో ఊహించలేదు. అది ఈరోజు నిజమైంది. మాములుగా వారానికి మూడు రోజులు ఇంట్లో టీవి ఆన్ చేస్తే కనిపిస్తాను. అలాంటిది నా కోసం టికెట్ కొనుక్కొని థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా విడుదలైనప్పటి నుండి అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. పెద్ద పెద్ద టెక్నిషియన్స్ వర్క్ చేయడం వల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మా డైరెక్టర్ గారు మొదటి రోజు నుండి సినిమా బాగుంది అని పాజిటివ్ టాక్ రావడంతో మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్లారు. ఆయన తరపున మీ అందరికీ హృదయపూర్వక దన్యవాదాలు” అన్నారు.
ఈ విజయానికి గుర్తుగా నా పేరుని సాప్ట్ వేర్ శేఖర్ రాజుగా మార్చుకున్నాను!!
చిత్ర నిర్మాత సాఫ్ట్ వేర్ శేఖర్ రాజు మాట్లాడుతూ – “నా మొదటి సినిమాను హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. కథ నచ్చి డబ్బుతీసుకోకుండా నటించిన డా. శివ ప్రసాద్ గారికి ఈ సినిమా అంకితమిస్తున్నాను. మా సినిమా మొదటి రోజు 190 థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పుడు 300 థియేటర్స్ లో రన్ అవుతోంది. మా ‘సాఫ్ట్వేర్ సుధీర్` విడుదలైన రెండు రోజుల్లోనే 4 కోట్ల 50లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇంకా థియేటర్స్ పెంచుతున్నాము అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ఈ విజయానికి గుర్తుగా నా పేరుని సాఫ్ట్ వేర్ శేఖర్ రాజు గా మార్చుకున్నాను” అన్నారు.
హీరోయిన్ ధన్యబాలకృష్ణ మాట్లాడుతూ – “ఈ సినిమా నార్మల్ ఓపెనింగ్స్ తీసుకుంటుంది అనుకున్నాం కానీ సుధీర్ ఫ్యాన్స్ దీనిని ఆడియన్స్ లోకి తీసుకెళ్లి ఒక పండుగలా ఇంత పెద్ద ఓపెనింగ్స్ ఇచ్చారు. మౌత్ పబ్లిసిటీ తో సినిమా బాగా ఆడుతుంది. తెలుగు రాష్టాల్లోనే కాదు కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక మంచి హిట్ కొట్టమని సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని సక్సెస్ చేసిన ఆడియన్స్ కి, సుధీర్ ఫ్యాన్స్ కి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ – ” ‘సాఫ్ట్వేర్ సుధీర్’ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు గర్వంగా ఉంది. థియేటర్స్ కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ చప్పట్లు విజిల్స్ తో ఒక పెద్ద భహిరంగ సభలా అనిపించింది. నేను చేసిన పాటలకి సుధీర్ అన్న,ధన్య చేసిన డాన్సులు చూస్తే ఎవ్వరికైనా గూస్బమ్స్ వస్తాయి. నా పాట ఈ రోజు గెలిచింది అంటే ప్రధాన కారణం సుధీర్ గారు. సినిమా 200లో విడుదలైంది. ఇప్పుడు 300థియేటర్స్ లో ఆడుతుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయింది అనడానికి ఇదే ఉదాహరణ. ఇంత మంచి సినిమాని నిర్మించిన శేఖర్ రాజు గారికి, నా స్నేహితుడు రాజశేఖర్ కి కృతజ్ఞతలు. ఈ చిత్రంలో సురేష్ ఉపాధ్యాయ మూడు పాటలు రాశారు. ఇంత అందమే పాట పెద్ద హిట్ అయింది. అతనికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.
లిరిసిస్ట్ సురేష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ – ” ఈ సినిమాలో `ఇంత అందమే,కోయం బత్తూరు పీసు, ఐడెంటిటీ కార్డు” మూడు పాటలు రాశాను. అన్ని పెద్ద హిట్ అయ్యాయి. సుధీర్ అన్నడ్యాన్స్ లు ఇరగదీశారు. ఇంతమంచి అవకాశం ఇచ్చిన నిర్మాత శేఖర్ రాజు గారికి, దర్శకుడు రాజశేఖర్ గారికి, భీమ్స్ కి ధన్యవాదాలు” అన్నారు.
నైజాం డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ మాట్లాడుతూ – “ఈ చిత్రాన్ని మొదట 190 థియేటర్స్ లో విడుదల చేశాం. ఇప్పడు 300 థియేటర్స్ లో రన్ అవుతోంది. ఇంకా థియేటర్స్ పెంచే అవకాశం ఉంది” అన్నారు.