Stand Up Rahul Movie Heroin Varsha Bollamma Interview

ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇచ్చేలా `స్టాండప్ రాహుల్` వుంటుంది- కథానాయిక వర్ష బొల్లమ్మ
కోవిడ్ తర్వాత ఎక్కువ టెన్షన్ పడాల్సి వచ్చింది. అందుకే థియేటర్‌కు వెళ్సి హాయిగా నవ్వుకుంటూ బయటకు వచ్చేలా వుండాలని నాకు అనిపిస్తుంది. అందరికీ అలానే అనిపించేలా `స్టాండప్ రాహుల్` చిత్రం వుంటుందని కథానాయిక వర్ష బొల్లమ్మ అన్నారు.
హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈనెల 18న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా మంగళవారంనాడు సంస్థ కార్యాలయంలో వర్ష బొల్లమ్మ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు తెలియజేశారు.
– నేను ఎంచుకునే పాత్రల్లో స్క్రీన్ స్పేస్ ఎక్కువగా లేకపోయినా పాత్ర స్ట్రాంగ్ గా వుంటే ఇష్టపడతాను. కానీ ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ కూడా బాగుంది. మహిళ అంటే తల్లిదండ్రులకు, పిల్లలకు సపోర్ట్‌గా వుంటుంది. ఇందులో నా పాత్రపేరు శ్రేయ. తనకంటూ కొన్ని డ్రీమ్స్ వుంటాయి. తన డ్రీమ్తోపాటు పార్టనర్ డ్రీమ్కూడా ఇందులో మిళితం అయివుంటుంది. అందువల్లే రాజ్‌తరుణ్‌తోపాటు సమానస్థాయి పాత్ర నాది.
– మొదట రాజ్ తరుణ్‌తో నటించడం అంటే తను సీనియర్ కదా అనిపించింది. కానీ వర్క్ షాప్ చేసేటప్పుడు తను, నేను ఒకేలా ఆలోచిస్తున్నామనిపించింది. తను హైపర్. జోక్స్ బాగా చెబుతాడు. దాని వల్ల చాలా కంఫర్ట్‌గా అనిపించింది.
– నేను కర్నాటకలోని కూర్గ్‌లో పుట్టి, బెంగుళూరులో చదివాను. నా కుటుంబంలో సినిమారంగంలో ఎవ్వరూ లేరు. నేనే కొత్తగా ఈ రంగంలోకి వచ్చాను. పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు.
– ఒకప్పుడు వర్క్‌షాప్‌లు పెద్దగా వుండేవికావు. నాకు వర్క్‌షాప్‌లు అంటే ఇష్టం. వీటివల్ల భాషతోపాటు నటనను ఫుల్ ఫిల్ చేస్తుంది. ఇంతకుముందు `మిడిల్ క్లాస్ మెలోడీస్` సినిమాకూ వర్క్ షాప్ చేశాను. ఇవి డైరెక్టర్‌ను బట్టి వుంటాయి.