Sudhir Babu in regular shooting – Bhavya Creations action thriller
రెగ్యులర్ షూటింగ్లో సుధీర్ బాబు – భవ్య క్రియేషన్స్ యాక్షన్ థ్రిల్లర్
—————————————————————–
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ రోజు హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “సుధీర్ బాబు హీరోగా ‘శమంతకమణి’ తర్వాత మా సంస్థలో చేస్తున్న చిత్రమిది. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 23 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇందులో సుధీర్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, గోపరాజు రమణ, ‘జెమినీ’ సురేష్, మైమ్ గోపి, అజయ్ రత్నం తదితరులు నటిస్తున్నారు. తొలి షెడ్యూల్లో హీరో, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేశాం” అని చెప్పారు.
సుధీర్ బాబు హీరోగా… ఇతర పాత్రల్లో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, గోపరాజు రమణ, ‘జెమినీ’ సురేష్, మైమ్ గోపి, అజయ్ రత్నం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరుల్ విన్సెంట్, కళ: వివేక్, కూర్పు: ప్రవీణ్ పూడి, దర్శకత్వం: మహేష్, నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్, నిర్మాత: వి. ఆనంద ప్రసాద్.