Top Gear Is A Racy Thriller With A Different Story: Aadi Saikumar
‘టాప్ గేర్’ సినిమా టెక్నికల్‌గా అద్భుతం.. యంగ్ అండ్ లవ్లీ హీరో ఆది సాయి కుమార్
యంగ్ అండ్ లవ్లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా ఆది సాయి కుమార్ బుధవారం నాడు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..
*ఒకే ఏడాది మూడు సినిమాలు వచ్చాయి.. దీనిపై మీ స్పందన ఏంటి?*
కరోనా వల్ల అన్ని సినిమాలు ఆలస్యమయ్యాయి. అందుకే అన్నీ ఒకే సారి వస్తున్నాయి. ఇక సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాలు రావడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. చిన్న సినిమాలకు ప్రస్తుతం డేట్స్ దొరకడం కష్టంగా మారింది. అందుకే ఈ ఏడాదిలో నా నుంచి మూడు చిత్రాలు వచ్చాయి.
*టాప్ గేర్ సినిమా కథలో ఏ అంశం నచ్చింది? సినిమాను ఎందుకు ఎంచుకున్నారు?*
టాప్ గేర్ కథ నాకు బాగా నచ్చింది. క్యాబ్ డ్రైవర్.. అతని జీవితంలో చిన్న సమస్య.. అది పెద్దగా మారడం.. ఒక్క రోజులో ఈ కథ జరుగుతుంది.. మా టీం అందరికీ ఈ కథ నచ్చింది. అందుకే ఈ సినిమాను చేశాం.
*టాప్ గేర్ టైటిల్ ఆసక్తికరంగా ఉంది. ఈ ఆలోచన ఎవరిది?*
టాప్ గేర్ అనే టైటిల్‌ను ముందుగా అనుకోలేదు. కానీ హీరో కారెక్టర్ మాత్రం టాప్ గేర్‌లోనే ఉంటుంది. హీరో టాప్ గేర్ వేయాల్సి వస్తుంది. ఒకసారి టాప్ గేర్ అని అనుకున్నాం. చాలా స్టైలిష్ గా ఉందని ఆ టైటిల్‌ను ఫిక్స్ చేశాం.
*టాప్ గేర్ డైరెక్టర్‌తో పని చేయడం ఎలా అనిపించింది?*
డైరెక్టర్ శశికాంత్ చూస్తే ఓ ప్రొఫెసర్లా ఉంటారు. కానీ చాలా క్లారిటీతో ఉంటాడు. సీనియర్ డీఓపీ సాయి శ్రీరామ్ కి కూడా ఆ షాట్ అలా తీద్దాం ఇలా తీద్దామని చెబుతుండేవాడు. చాలా క్లారిటీతో ఉండేవాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి సైతం కంటెంట్ చాలా బాగుందని, బాగా తీశారని అన్నాడు.
*టాప్ గేర్ పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుందా?*
టాప్ గేర్ అనేది కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏమీ కాదు. ఓ కుర్రాడు తనకు సంబంధం లేని చిక్కుల్లో ఇరుక్కుంటే ఏం అవుతుంది.. దాన్నుంచి ఎలా బయటపడతాడు అనేది చూపిస్తాం. ఐడియా కొత్తగా ఉంటే నేను సినిమాలను ఎంచుకుంటాను. ఐడియా బాగుంటే సగం సినిమా హిట్ అయినట్టే. మిగతాది అంతా స్క్రీన్ ప్లేలో ఉంటుంది. అయినా జనాలకు ఇప్పుడు ఏది నచ్చుతుందనేది అంచనా వేయలేకపోతున్నాం.
*పూర్తి మాస్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుతుంటారు. మరి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా?*
ఇప్పుడు మాస్ స్టోరీలంటే అర్థం మారింది. కేజీయఫ్ సినిమా వచ్చి అంతా మార్చేసింది. అలాంటి సినిమాలే ఇప్పుడు మాస్కు నచ్చుతున్నాయి. ఇప్పుడు చేస్తే అలాంటి సినిమానే చేస్తాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేయను.
*టాప్ గేర్ సినిమాలో ఫైట్స్ కీలకంగా మారేలా ఉన్నాయి. ఫైట్ మాస్టర్ గురించి చెప్పండి?*
రొమాంటిక్ సినిమాతో ఫైట్ మాస్టర్ పృథ్వీకి మంచి బ్రేక్ వచ్చింది. ఎంతో సహజంగా ఫైట్లను కంపోజ్ చేస్తుంటాడు. ఫైట్‌లో కూడా కథను చెప్పాలని చూస్తాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఓ సీన్ చేశాం. ఆ టైంలో యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా రాత్రే షూటింగ్ చేశాం.
*టాప్ గేర్ సినిమాకు కారు కీలకంగా మారుతున్నట్టుంది?ప్రత్యేకంగా కారుని డిజైన్ చేశారా?*
టాప్ గేర్ సినిమా అంతా కూడా కారులోనే ఉంటుంది. కాబట్టి మా ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ ఆ విషయంంలో కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులో నేను క్యాబ్ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాను. కానీ కథలో ఓ భాగంగానే ఆ పాత్ర ఉంటుంది.
*ఈ సినిమాకు మ్యూజిక్, ఆర్ఆర్ ప్రాముఖ్యత ఎంత ఉంటుంది?*
టాప్ గేర్ సినిమాకు ఆర్ఆర్ చాలా ముఖ్యం. హర్షవర్దన్ రామేశ్వర్ మాకు అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయన అంతకు ముందు ఆర్జున్ రెడ్డి చేశాడు. ప్రస్తుతం రవితేజ రావణాసుర, యానిమల్ సినిమాలు చేస్తున్నాడు. టాప్ గేర్ సినిమా బాగుందని ఆయన కూడా అన్నారు. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుంది.
*కొత్త కథలు, ప్రయోగాలు చేసేందుకు ఆసక్తిగానే ఉన్నారా?..* *ప్రస్తుతం చేస్తున్న సినిమా సంగతులు ఏంటి?*
కొత్త కథలు చేయాలని, ప్రయోగాలు చేయాలని ఉంటుంది. ప్రస్తుతం నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. జీ5 కోసం నేను చేయబోతున్న వెబ్ సిరీస్‌లో ఎవ్వరూ ఊహించనటువంటి పాత్రను పోషిస్తున్నాను. కానీ నా వద్దకు వచ్చే కథలన్నీ కమర్షియల్ యాంగిల్లోనే ఉంటాయి. కానీ నాకు రియలిస్టిక్ సినిమాలు చేయాలని ఉంటుంది.
*నెగెటివ్ రోల్స్ ఏమైనా చేస్తారా? ఆ దిశగా ఏమైనా ఆఫర్లు వచ్చాయా?*
నెగెటివ్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు హీరోగా మంచి చిత్రాలు చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కూడా చకాచకా చిత్రాలు చేసేయాలని అనుకుంటున్నాను.
*టాప్ గేర్ సినిమా ఎలా ఉండబోతోంది?*
టాప్ గేర్ సినిమా టెక్నికల్‌గా బాగుంటుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటాయి.
*భవిష్యత్ సినిమాల గురించి చెప్పండి?*
నేను ప్రస్తుతం లక్కీ మీడియాకు ఓ సినిమా చేస్తున్నాను. జీ5 కోసం చేసిన వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయింది. వచ్చే నెలలో ప్రమోషన్స్ మొదలుపెడతారు. సినిమాకు తక్కువ కాకుండా ఉంటుంది. మొదటి సీజన్లో ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయి.
*హీరోయిన్ రియాతో పని చేసిన అనుభవం ఎలా ఉంది?*
రియాకు నాకు సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఆమె ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్నారు. నయనతార ప్రొడక్షన్ కంపెనీలో సినిమా చేస్తోంది. ఆమెతో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో చక్కగా నటించింది.
*టాప్ గేర్ సినిమాను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారా?*
టాప్ గేర్ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. హిందీలో డబ్ చేస్తున్నాం. గరం సినిమాతో నార్త్‌లో బాగానే క్రేజ్ వచ్చింది. లవ్ లీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ హిందీ ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి.
*మీ మాస్ ఇమేజ్ను చూసి నిర్మాతలు ముందుకు వస్తున్నారా?* *కంటెంట్ చూసి వస్తుంటారా?*
మంచి కంటెంట్ ఉంటేనే నిర్మాతలు ముందుకు వస్తారు. నా ప్రతీ సినిమా టెక్నికల్‌గా బాగా ఉంటుంది. నా చిత్రాలు ఓటీటీలోనూ బాగానే ఆడుతుంటాయి. కొన్ని పరిస్థితుల వల్ల థియేటర్లో సరిగ్గా ఆడలేదు. శశి సినిమాకు థియేటర్లో ఓపెనింగ్స్ వచ్చాయి. ఓటీటీలో బాగా ఆడింది. క్రేజీ ఫెల్లో సినిమా కూడా ఓటీటీలో బాగా ఆడింది.
*మీ నాన్న గారి సినిమాలైనా, పాటల్లో ఏదైనా రీమేక్ చేయాలని అనుకుంటున్నారా?*
నాన్న గారి పాటను రీమేక్ చేయాలని ఉంది. ‘అసలేం గుర్తుకురాదు’ అనే పాటను రీమేక్ చేయాలని ఉంది. కానీ ఆ సిట్యువేషన్ పడాలి. అయితే ఆ సాంగ్‌ను రీమేక్ చేస్తే మళ్లీ కృష్ణవంశీ గారే తీయాలి.
Top Gear Is A Racy Thriller With A Different Story: Aadi Saikumar
Promising young hero Aadi Saikumar is coming up with a unique action thriller Top Gear directed by K.Shashikanth. Aditya Movies & Entertainments is presenting the film, while K. V. Sridhar Reddy is producing it under the banner of Sri Dhanalakshmi Productions. Giridhar Mamidipalli is the executive producer. Sai Sriram, who worked as a cinematographer for several superhit films, is working on the film, while Harshavardhan Rameshwar who right now is one of the busiest composers scored music for Top Gear. A few days ahead of the release, Aadi interacted with the media.
*How the movie is going to be?*
Top Gear is a racy thriller. Director Shashikanth narrated two different stories. The other story is a political thriller. I felt the story of Top Gear is right for me. It’s about a cab driver who gets into trouble. What if the small problem becomes a big one. This is the story that happens in one day.
*What’s the story behind the title Top Gear?*
We didn’t lock the title, before starting the shoot. We felt it was an apt title when Top Gear was proposed. The protagonist needs to switch to Top Gear when situations demand him to do so. We also felt the title sounded stylish.
*What are the standout qualities you found in the director?*
Shashikanth has good clarity on everything. Though our DOP Sai Sreeram is very experienced, Sashi designed every shot and Sai Sreeram also liked his work style. He’s very confident from day one. Editor Prawin Pudi also liked the final outcome.
*You mostly did thrillers? What motivated you to do Top Gear?*
I didn’t mean to do only thrillers. Every second script I’m getting is a thriller. It’s difficult to say no to thrillers. However, Top Gear is not completely a thriller.
*Will you do mass movies again?*
The definition of mass has been changed, after KGF. People are not keen to watch regular mass entertainers. The story or the narration needs to be different. We are habituated to English favored movies. I heard a powerful script and it’s not a regular one.
*What do you say about the action part?*
Prithvi is a good fight master. He got a big break with Romantic. He follows the story and choreographs fights. The action part is very natural in the movie. There is a struggle in the fights as well. He took the best care while canning risky stunts.
*How crucial car’s role in the movie?*
Art director Ramanjaneyulu wanted the car to be good and special. He designed the car perfectly, as per the need of the story.
*How important is the music for the film?*
Of course, music is very important, especially the BGM. Harshavardhan Rameshwar is busy with Animal, Ravanasura and other films. He’s also very confident about the outcome. The movie has only one song.
*Do you want to come out of commercial format and try different concepts?*
Yes, of course. Though I do commercial movies here and there, I’m keen on doing different movies. Top Gear is also a content-based movie. I’m also doing a web series for Zee5, and my character as well as the set-up will surprise you for sure. It’s an experimental project. Many are approaching me with commercial subjects. But I’m keen on doing more realistic films that have commercial viability.
*Did you get negative roles?*
I got, but I didn’t want to do it now. To be frank, I’m getting good offers now. I don’t want to take a wrong step now. But if I get something extraordinary, for sure, I’ll do negative roles as well.
*What are the highlights of the movie?*
I think for sure the movie will be completely engaging. Everybody performed well. Mime Gopi played the main villain exceptionally. He is the main pillar. Shatru, Brahmaji, Satyam Rajesh were too good. Technically too, it’s a good movie. Cinematography and music are other big assets.
*What are your next projects?*
I signed a movie for Lucky Media. It’s a good story with a new director. I’m also in talks for other projects. The shoot of the web series Puli Meka is already done. Kona Venkat is the producer. Chakravarthy who did Pantham with Gopichand is the director. It has good casting with Lavanya Tripathi, Suman, Avinash etc playing important roles. It’s no less than a cinema. It will have 8 episodes. I’m confident about that as well.
*Do you have any issues with heroine Riya Suman?*
No, not at all. It’s nice working with her. We didn’t have many scenes together. She’s busy in Tamil now. Riya is doing a movie in Nayanthara’s banner.
*Are you planning to release the movie in other languages?*
No for now. It will however be dubbed in Hindi. I feel due to the success of action movies like Garam in Hindi, there is good demand for Hindi rights of my movies. Lovely also worked well in Hindi. We told about Kashmir Hindi Pundits in Operation Gold Fish, much before The Kashmir Files was made. I was shocked to see the views count and comments for the movie.
*What do you say about the theatrical business and OTT market?*
My movies are doing good on OTT. Due to unfavorable conditions, the theatrical business is not impressive. My previous movie Sashi also got good openings, but it didn’t fare well at the box office, though it performed well on OTT. My last movie Crazy Fellow also got good reception on OTT. We released it on 13th and Kantara came on 14th. There was a huge buzz for Kantara, two weeks before the release. I didn’t know whether it was a wrong release or some other reason for the film’s debacle at the box office.
*Do you plan to remake your dad’s movies?*
No. But we want to remix- dad’s song ‘Asalem Gurthukuradu’ from ‘Anthapuram’.
*Do you take family support, before finalizing scripts?*
Definitely. I decided to start films, only after the script is locked.