UV Creations To Present Nayanthara’s Connect in Telugu
UV Creations To Present Nayanthara’s Connect in Telugu
Nayanthara is known for doing content driven films. She is back at it
again with Connect which is the first Tamil film without an
intermission.
The latest news is that top production house UV Creations are on-board
to present the film in Telugu.
UV Creations are the leading production and distribution house in
Telugu cinema and they’re now set to give Connect a super wide release
in Telugu.
Connect is a Horror- Thriller with a new age plot. The film is said to
be an edge of the seat thriller and Nayanthara’s performance in the
same is touted to be the mainstay.
The film is directed by Ashwin Saravanan and it has Anupam Kher,
Nayanthara, Sathyaraj and others in the lead roles. Ashwin Saravan is
already a reputed name as he delivered a blockbuster with Mayuri,
featuring Nayanthara and also helmed another critically acclaimed
film, Game Over with Tapsee. He is back with Connect now.
Vignesh Shivan is producing the film and it is being presented by UV
Creations in Telugu. The film is set for theatrical release on the
22nd of this month.
యూవీ క్రియేషన్స్ ద్వారా ఈ నెల 22న నయనతార హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” రిలీజ్
నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” సినిమాను యూవీ
క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని
రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్
శరవణన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.
హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్
స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన “మయూరి” సినిమా తెలుగులో
విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన “గేమ్
ఓవర్” కూడా సూపర్ హిట్టయ్యింది. కనెక్ట్ చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి
కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్ టీజర్‌కు
సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్
గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ
సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే
ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అనుపమ్ ఖేర్‌తోపాటు సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో
నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – పృథ్వి చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ –
మణికంఠన్ కృష్ణమాచారి, ఎడిటింగ్ – రిచర్డ్ కెవిన్, పీఆర్వో – జీఎస్కే
మీడియా.