Vishnu Manchu mourns Kaikala Satyanarayana’s demise

తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి మరణం తెలుగు సినిమా పరిశ్రమ కి ఒక తీరని లోటు.
రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో మనం చూడలేదు. కానీ మన పౌరాణిక చిత్రాల తో మనకు రాముడైనా, కృష్ణుడైనా నందమూరి తారక రామారావు గారు మాత్రమే అనిపించేలా నటించి తెలుగు ప్రజలకు దేవుడయ్యాడు. అలాగే భీముడు, దుర్యోధనుడు, యముడు అంటే మనకు ఠక్కున గుర్తుకువచ్చేది ఆజానుబాహుడు, హీరోలతో సరితూగే పాత్రలో నటించి మెప్పించగలిగే నటులలో ఒకే ఒక్కరు కైకాల సత్యనారాయణ గారు.
ఆయన వేసిన పాత్రలు, చెప్పిన డైలాగులు తెలుగు వాడి గుండెల్లో పదిలంగా ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఎన్నో మహత్తర పాత్రలకు జీవం పోసిన సత్యనారాయణ గారు మన తెలుగు వాడు కావడం విశేషం. తన ఆహార్యం, అభినయం తో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ గారు మన మధ్య లేకపోయినా కళామతల్లి ముద్దు బిడ్డగా ఆయన ఎప్పటికీ తెలుగు వారి గుండెల్లో బతికే ఉంటారు.
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబ సబ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
విష్ణు మంచు