బిగ్ బాస్ కు సెన్సారు అవసరం….

బిగ్ బాస్ ప్రోగ్రాం అసభ్యకరంగా ఉందనీ, హగ్గులు, ముగ్గులు లాంటివి ఉండకూడదనీ, అవి చూసి తెలుగు ప్రేక్షకులు పాడైపోతారనీ, సినిమా మాదిరిగా ఈ ప్రోగ్రాం ప్రతి ఎపిసోడ్ సెన్సారు చేయించాలనీ, రాత్రి పదకొండు గంటల తరువాత మాత్రమే దీనిని ప్రసారం చేయాలనీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేసారు…ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి, హీరోయిన్ గాయత్రీ గుప్తా ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బిగ్ బాస్ నిర్వాహకులపై కేసు కూడా పెట్టారు.. నిర్వాహకులు అసభ్యంగా మాట్లాడారనీ, రెండు నెలలు నుంచీ ఏ సినిమా చేయకుండా ఈ ప్రోగ్రాం కోసం ఖాళీగా ఉన్నకారణంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. ఈ కేసులన్నీ ఎత్తివేయాలనీ స్కాష్ పిటిషన్ మా టీవీ యాజమాన్యం హైకోర్టులో వేసారు.. చూడాలి ఏ జరుగుతుందో…