These movies are in Controversies
వివాదాల్లో ఈ చిత్రాల్లో…
అదేంటి తెలియదు కానీ హరీష్ శంకర్ సినిమాలు చేస్తే చాలు కాంట్రవర్సీలు కూడా తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. డిజే సినిమా విషయంలోనే చాలా వివాదాలు ఎదుర్కొన్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు వాల్మీకి సినిమా టైటిల్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సినిమా టైటిల్ మార్చాల్సిందే అని.. కచ్చితంగా దీన్ని అవమానిస్తే చర్యలు తీసుకుంటాం అంటున్నారు కొందరు. ఇదే విషయంపై ఇప్పుడు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కలిసారు. వాల్మీకి పేరు అనేది ఎలా పడితే అలా వాడుకునేది కాదంటున్నారు వాళ్లు.
ఈ విషయంపై సమాచార మరియు బ్రాడ్ కాస్టింగ్ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను ఢిల్లీలోని ఆయన ఆఫీస్‌లోనే కలిసి వినతి పత్రం అందజేసారు. వరుణ్ తేజ్, అథర్వా మురళి హీరోలుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది. తమిళ బ్లాక్ బస్టర్ జిగర్తాండ సినిమాకు ఇది రీమేక్. వాల్మీకి టైటిల్ అనౌన్స్ చేసిన రోజే ఈ రచ్చ మొదలైంది. అయినా కూడా మొండిగా ముందుకు వెళ్లిపోయాడు హరీష్.
ఇప్పుడు ఇదే విషయంపై రాజకీయంగా కూడా రచ్చ నడుస్తుంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి కూడా తీవ్ర ఆగ్రహం చూపించారు. ఈ విషయం చాలా సున్నితమైందని.. చర్చనీయమైందని.. వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రకాశ్ జవదేకర్. మొత్తానికి చూడాలిక.. ఈ సినిమాపై ఎలాంటి వివాదాలు రేగబోతున్నాయో..? అబ్బాయి సినిమా టైటిల్ వివాదం ఇలా ఉంటే పెదనాన్న నటించిన సైరా నర్సింహారెడ్డిది మరో వివాదం నడుస్తుంది. అదేమిటంటే…మాకు న్యాయం చేయాలంటూ ఉయ్యాలవాడ వంశీ యులు జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.సైరా నరసింహారెడ్డి సినిమా తీసేందుకు కావలసిన పూర్తి సమాచారంతో పాటు, సినిమా షూటింగ్ చేసుకునేందుకు అవసరమైన లొకేషన్ లతో పాటు, నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రను పూర్తిగా తమనుండి తెలుసుకొన్నారని అన్నారు. సినిమాకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకుని షూటింగ్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చిరంజీవి తమకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారని కానీ ప్రస్తుతం తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మొత్తానికి వీరిద్దరి సినిమాకి వచ్చే వివాదాలను ఎలా అబ్బాయి పెదనాన్న ఎలా ఎదుర్కొంటారు. వీరి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది తెర వేచి చూడాల్సిందే.