Ramgopal Varma interview
ఈ చిత్రాన్ని ఆ తండ్రి కొడుకులకు అంకితం ఇస్తున్నాను
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు
ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈ సినిమా నా మొత్తం కెరీర్లో మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది.?
ఈ నెల 29 న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా విషయంలో చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఎవరో కోర్టుకు వెళ్లారు అని కూడా ఈ మధ్య న్యూస్ లో వచ్చింది .?
నా సినిమా విషయంలో కోర్టుకు వెళ్లడం అంటే సూర్యుడు తూర్పున ఉదయించిన అంత రెగ్యులర్ అయిపోయింది
సో ఆ విషయం గురించి నేను పెద్దగా పట్టించుకోను
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా 2019 మే నుండి 2020 సెప్టెంబర్ వరకు జరగబోయే విషయాలన్నింటిని ఊహించి తీసిన సినిమా.
ఈ సినిమా ఎవరిని టార్గెట్ చేసి తీశారు.?
ఎవరిని టార్గెట్ చేయలేదు ఉన్నది తీశాను.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని బాలకృష్ణకు అంకితం ఇచ్చారు కాబట్టి ఈ సినిమాను ఎవరికైనా అంకితం ఇస్తారా.?
ఈ సినిమాని ఇద్దరు తండ్రి కొడుకులకు అంకితం ఇస్తున్నాను దయచేసి వాళ్ళ పేర్లు అడగొద్దు.
ఈ సినిమా విషయంలో కెఏ పాల్ గారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దానికి మీరేమంటారు.?
నేను పట్టించుకోవడం మానేశాను అది వేరే పాయింట్,
ఆయన ప్రపంచ యుద్ధం ఆపారు కాబట్టి దీనిని అంత సీరియస్ గా తీసుకుంటారు అని అనుకోవట్లేలేదు నేను.
మీకు సహనం ఎక్కువ అని చాలామంది అంటుంటారు కొంతమంది తిడుతుంటారు కూడా .?
నాకు తిట్టించుకోకపోతే నిద్ర పట్టదు
ఎవరైనా పొగిడితే నిద్ర వచ్చేస్తుంది.
నిజజీవితంలో మనుషులను పోలిన నటులను ఎలా తీసుకుని వస్తారు .?
గత ముఖ్యమంత్రి పోలిక లకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో చూసి ఆయనను తీసుకొని వచ్చాను ఆయన హోటల్ లో వెయిటర్.
తనని తీసుకుని వచ్చి ఒక నెల రోజులు యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇచ్చాము.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా మీ క్రియేటివ్ satisfaction కోసం తీశారా లేకపోతే మీ పర్సనల్
satisfaction కోసం తీశారా.?
మంచి క్వశ్చన్ చేశారు కేఏపాల్ లాగా మాట్లాడారు,
నాకు చిన్నప్పటి నుండి గిళ్లడం ఇష్టం,
దానిలోనే ఆన్సర్ ఉంది కదా నా పర్సనల్ Satisfaction కోసమే తీసాను.
మట్టి ముద్దలో మజ్జిగ అన్నం అని ఏదో ప్రాజెక్టు అనౌన్స్ చేశారు .?
నేనెప్పుడు వినలేదు ఆ పేరు ఏంటి అసలు,ఏంటి అసలు.?
పవన్ కళ్యాణ్ గారు ….
ఓ… బాగుంది టైటిల్ ఈ టైటిల్ తో సినిమా చేస్తే మీడియాకి అంకితం ఇస్తాను.
క్రైమ్,దెయ్యాలు, గ్యాంగ్ స్టార్ జోనర్ విడిచి ఈ పొలిటికల్ జోనర్ లో చేయడానికి కారణం .?
మాములు క్రైమ్స్ కంటే పొలిటికల్ క్రైమ్స్ ఇంకా బెటర్ గా ఉన్నాయని.
జనసేన పార్టీ నీ టార్గెట్ చేశారు కదా దీనిలో ఫ్యాన్స్ ఏమైనా బెదిరించారా .?
ఈ సినిమాలో జనసేన కాదు మనసేన,
దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు మీ జర్నలిస్ట్ లు మీద ఒట్టేసి చెబుతున్న.