Director VI Anandh Interview photos
క్రిస్టోఫర్ నోలెన్ షూట్ చేసిన లోకేషన్ లో డిస్కోరాజా షూట్ చేసాం – వి.ఆనంద్
మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎక్కడికి పోతావ్ చిన్నవాడా,ఒక్క క్షణం లాంటి హిట్ సినిమాలు తరువాత వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో వస్తున్నా చిత్రం డిస్కోరాజా
ఈ సందర్భంగా దర్శకుడు వి.ఐ. ఆనంద్ మీడియాతో మాట్లాడారు.!
సైన్స్ ఫిక్షన్ కి మీకు సంబంధం ఏంటి.?
నాకు సైన్స్ ఫిక్షన్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం,ఫాంటసీ నాకు ఇష్టం
స్టీవెన్ స్పెల్ బర్గ్ , ఎలినో,అభీసో,క్రిస్టోఫర్ నోలేన్ తీసిన సినిమాలు నాకు చాలా ఇష్టం,
సో ఈ డిస్కోరాజా సినిమా పాయింట్ వచ్చేసి 10 ఇయర్స్ ముందే నా మైండ్ లో ఉంది,ఒక ఆర్టికల్ చదివి దాన్ని బేస్ చేసుకుని ఈ స్టోరీ మొత్తం సెట్ అయింది.దీనిలో ఫోర్స్ ఎలిమెంట్స్ లేవు అని సినిమాలో అలా కుదిరాయి.
మీ కెరియర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ కదా.?
అవునండీ ఇప్పటివరకు నా కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్ ఫిల్మ్ అండ్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది నా కెరియర్ కి చాలా ఇంపార్టెంట్.ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఉన్నాయి ఐస్లాండ్ లో షూట్ చేసాం అది చాలా ఛాలెంజింగ్ పోర్షన్,మేము చాలా రిస్క్ చేసాం,క్రిస్టోఫర్ నోలేన్ ఇంట్రస్టీలర్ షూట్ చేసిన ప్లేస్ లో మేము షూట్ చేసాం అన్నది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
వేరే యాక్టర్స్ తియ్యాలనుకున్న సినిమా ఇదేనా.?
కాదండి ఇది కంప్లీట్ గా రవితేజ గారిని దృష్టిలో పెట్టుకునే రాసాను,ఆయనకు హీరో హిజం ఉండాలి, సర్కాజం ఉండాలి అటిట్యూడ్ ఉండాలి ఇవన్నీ రవితేజ గారిలో చూస్తాం మనం ఈ సినిమాలో.
ఆయన కమర్షియల్ హీరో మీరు కంటెంట్ ఓరియెంటెడ్ డైరెక్టర్
మీ ఫార్మాట్ లోకి ఆయన వచ్చారా,
ఆయన ఫార్మాట్ లోకి మీరు వెళ్ళారా.?
ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ లాగా కలిసి ట్రావెల్ చేసాం,
కాన్సెప్ట్ లో కమర్షియల్ ఎందుకు వర్కౌట్ కాదు అనేది నా ఆలోచన
అలా నేను ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసాను.
మేకింగ్ ఏమైనా డీలే అయ్యిందా.?
లేదండి ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకున్నాం.
బాబీ సింహా గురించి.?
ఆయన ఒక తమిళ్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తారు ఈ సినిమాలో జిగర్తాండ తర్వాత ఆ టైప్ ఆఫ్ రోల్ ఈ సినిమాలో కనిపిస్తోంది.
దీనికి సీక్వెల్ కూడా రెడీ గా ఉంది అండి.?
సీక్వెల్ రెడీ గా ఉంది అండి,ఆయనకు కూడా చెప్పాను బట్ ఆయన ఏమన్నారు అంటే ముందు దీని రిజల్ట్ చూద్దాం అన్నారు.
హీరోహిన్స్ గురించి.?
అందరికి మంచి రోల్ ఉంది అండి,ఎదో వచ్చి వెళ్తున్నట్లు కాకుండా ఈక్వెల్ ఇంపార్టెంట్ ఉంది.