మిస్టర్ కె.కె. ప్రీ రిలీజ్
శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాలతో తెలుగు లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్ కథానాయకుడిగా అక్షరహసన్, అభిహసన్ కీలక పాత్రల్లో రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో తమిళంలో రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.రవిచంద్రన్ బ్యానర్ పై రూపోందిన `కడరమ్ కొండాన్` చిత్రాన్ని తెలుగు లో నిర్మాతలు టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ లు సంయుక్తంగా టి.అంజయ్య సమర్పణలో నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెషన్స్ బ్యానర్‌పై జూలై 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దస్పల్లా హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. విలేకరుల సమావేశంలో…
టి. అంజయ్య ప్రొడ్యూసర్ మాట్లాడుతూ… మిస్టర్ కె.కె. ప్రీ రిలీజ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రం వెనుకాల ఎంతో మంది పెద్దల కష్టం ఉంది. మొట్ట మొదటిగా కమల్‌హాసన్‌గారు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఒక విలక్షణమైన నటుడు. ఆయన ఇండస్ట్రీకి ఒక డిక్షనరీ లాంటి వారు. ఆయన సొంత బ్యానర్లో నిర్మించిన చిత్రానికి మేం భాగమైనందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంత త్వరలో చియాన్ విక్రమ్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఈ రోజు 3 గంటలు ఉన్నా. మలేషియా నుంచి రాత్రి వచ్చారు. సరిగా నిద్ర లేదు. అయినా ఆయన ఎనర్జీ చాలా మంచిది. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ఆయన ఎనర్జీలో కొంత నాకు ఉన్నా ఓకే. ప్రొడ్యూసర్ రవీదర్ గారు డబ్బుకు ఏమాతరం వెనకాడకుండా బాగా తీశారు. దిల్రాజులాగానే ఆయన కూడా చాలా పెద్ద ప్రొడ్యూసర్ అన్నారు. ఆయనే సొంతంగా తమిళ్లో 600 థియేటర్లలో విడుదల చేశారు. తిరిగి మళ్ళీ ఈ సినిమా సక్సెస్‌లో కలుద్దాం అన్నారు. ఇందులో నటించిన నటీనటులందరికీ చాలా చాలా థ్యాంక్యూ అన్నారు.
విక్రమ్ మాట్లాడుతూ…మీరు ట్రైలర్ చూశారు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది చాలా డిఫరెంట్‌గా ట్రైచేశాను. మా ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్. కమల్‌గారికి మరీ మరీ థ్యాంక్స్. రాజేష్కూడా మధ్యాహ్నం అన్నారు. చాలా బాగా ప్రమోషన్స్ ఇస్తున్నారు. మీ ప్రొడక్షన్లో చెయ్యడం చాలా అదృష్టం. జావేద్ టీం డాన్స్ బాగా చేశారు. ఈ పాటలు అన్నీ చూసి చాలా మెమొరీస్ వచ్చాయి. నరేష్, అండ్ భాస్కర్ థ్యాంక్స్ యువర్ ఫన్. సింగర్స్‌కి, నా కోఆర్టిస్ట్కి చాలా థ్యాంక్స్. అక్షర ఈజ్ బ్యూటీ ఇన్ ద మూవీ. ఇటువంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ చెయ్యడానికి మంచి టీం కావాలి. అందరూ బాగా చూశారు. నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఈ చిత్రంలో నటించినందుకు. రాజేష్ నాకు చాలా మంచి ఫ్రెండ్ కూడా. నాకు బాగా నచ్చాడు. చాలా మంచి హార్డ్ వర్కర్. నా ఫిట్నెస్ గురువు కూడా ఆయనే అని అన్నారు. అందరూ థియేటర్లోనే ఈ సినిమాని చూడండి అని అన్నారు.
డైరెక్టర్ రాజేష్ మాట్లాడుతూ… ఇది నా రెండవ చిత్రం. రెండవ సినిమానే రాజ్కమల్గారి ప్రొడక్షన్లో చెయ్యడం నా అదృష్టం. రవీంద్రన్‌గారు ఈ ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. తర్వాత విక్రమ్‌గారు యాడ్ అయ్యాక ఇదొక పెద్ద మూవీ అయిపోయింది. ఈ మూవీ ప్రమోషన్ విషయంలో ఎంటైర్ టీం కి చాలా కృతజ్ఞతలు. కెమెరామెన్ సెట్స్‌లోకి రాగానే టీం అందరికీ కొత్త ఎనర్జీ ఉంటుంది. కమల్‌గారితో సినిమాచేశాక తిరిగి మళ్ళీ ఇందులో చెయ్యడం అదృష్టం. అందరూ బాగా నటించారు. రామజోగయ్యశాస్త్రిగారు చాలా మంచి పాటలు అందించారు. యూనిట్ అందరికీ కృతజ్ఞతలు. విక్రమ్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు.
అక్షరహాసన్ మాట్లాడుతూ…నాకు తెలుగు అంతగా రాదు. ముందుగా రాజేష్‌గారికి, మా నాన్నగారికి నా కృతజ్ఞతలు. నేను ఈ క్యారెక్టర్ చెయ్యలేననుకున్నా కాని చాలా సపోర్ట్ చేశారు. అభి చాలా బాగా చేశారు. జిబ్రాన్ మ్యూజిక్ ఒక మ్యాజిక్ అని చెప్పాలి. అందరం చాలా కష్టపడ్డాం. టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో …గోవర్ధన్‌రెడ్డి, ఎఐసిసి స్పోక్స్‌పర్సన్, రామజోగయ్యశాస్త్రి ఇంకా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు