పోసానికి మంత్రి పదవి రావచ్చేమో..
పోసానికి మంత్రి పదవి రావచ్చేమో..
ఎస్వీబీసీ ఛానల్ కి చైర్మన్ గా ఎన్నికైన హాస్య నటుడు పృథ్వీరాజ్ హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తానెప్పుడూ రుణపడి ఉంటానని.. స్వామి వారికి చెందినవన్నీ స్వామి వారికే చెందాలని నా ఆకాంక్ష అని అన్నారు. ఎస్వీబీసీ ఛానల్ హైదరాబాదు, మద్రాసు, బెంగుళూరు స్టూడియోలను పర్యవేక్షించడానికి తిరుగుతున్నానని.. నా దేవుడు జగన్ కు తానెప్పుడూ సేవకుడిగా ఉంటానని..సగర్వంగా చెప్పుకుంటున్నాను… మహా నాయకుడు జగన్ వెనక సేవకుడిగా సైనికుడిగా వెళ్లడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నారు. తిరుమల కొండ మీద రాజకీయాల గురించి జండాల గురించి మాట్లాడను అని కేవలం ఎజెండాల గురించే మాట్లాడుతానని ఎస్వీబీసీ ఛానల్ ఉన్నతి గురించి ఆ ఉద్యోగుల సంక్షేమం గురించి మాట్లాడతానని వారి గురించే ఆలోచిస్తాను అని అన్నారు. చైర్మన్ సంస్కృతి నుంచి మార్చి సాధారణ ఉద్యోగి లాగా నేను ఛానల్ లో పనిచేస్తున్నాను..అమరావతిలో మాత్రం రాజకీయాలు మాట్లాడతాను నా దేవుడు జగన్ ని ఎవరు ఏమన్నా వారిని చీల్చి చెండాడుతా అన్నారు .. తిరుమలలో స్వామి భక్తుడను,అమరావతిలో జగన్ విధేయుడను అన్నారు..
ఎస్వీబీసీ ఛానల్ లో గతంలో జరిగిన అక్రమాలు అవినీతి ని బయటికి వెలికితీస్తాం..టీటీడీ చైర్మన్ సోదరుడు ఎస్. వి. సుబ్బారెడ్డి సహకారం తీసుకుంటాం..
పోసాని కృష్ణ మురళి పృథ్వీరాజ్ పై చేసిన వ్యాఖ్యల గురించి అడగగా..పోసాని కృష్ణ మురళి గారు చదువుకున్న వారిని ఆయన సీనియర్ అని ఏదైనా ఉంటే మేము మేము సరి చేసుకుంటావని మేమంతా కుటుంబం అని అన్నారు..ఆయన మా పార్టీ మనిషి అన్న స్థానంలో ఉన్నాడు ఏదన్నా అన్న తప్పు కాదు..నాకు ఇప్పుడు ఈ పదవి వచ్చింది.. రేపు పోసాని కృష్ణ మురళి గారు మంత్రి అయినా ఆశ్చర్యపడకండి అని సింపుల్గా తేల్చిచెప్పారు.
ఇదిలా ఉంటే గతంలో ఓ మీటింగ్లో 30 ఇయర్స్ పృథ్వి ఎవరికైనా ఓటెయ్యండి కాని సినిమావాళ్ళని నమ్మొద్దు అన్నారు. మరి ఒకవేళ ఆయన అన్నట్లే పోసానికి మంత్రి పదవి వస్తే మరి ప్రజలు ఆయన్ని నమ్మాలా అక్కర్లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే కేవలం రాజకీయ నాయకుల మాటలే కాక… సినిమావాళ్ళు కూడా వారి వారి సందర్భానుసారంగా మాట్లాడుతుంటారని అర్ధమవుతుంది. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరూ ఎన్నికల సమయంలో జగన్కు సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.