Avanthika Misra New Stills
తెలుగు, తమిళ్ మూవీ ఆఫర్స్ తో దూసుకుపోతోన్న అవంతిక మిశ్రా .
మోడల్ నుంచి నటిగా మారిన బ్యూటీ అవంతిక మిశ్ర. ఢిల్లీ లో పుట్టి,
బెంగళూరు లో చదువుకున్న ఈ భామ తెలుగులో నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ‘మాయ’
సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత వరుస అవకాశాలతో మీకుమీరే
మాకుమేమీ లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. అటుపై మీకు మాత్రమే చెపుతా,
వైశాఖం, భీష్మ చిత్రాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది.
ఈ గుర్తింపుతోనే ఇప్పుడు తమిళ్ లోనూ అడుగుపెట్టింది అవంతిక. తొలి సినిమా
విడుదలకు ముందే మరో రెండు సినిమాల్లో అవకాశాలు అందుకుకుని
ఆకట్టుకుంటోంది.
‘ఎన్న సొల్ల పొగరై’ అవంతిక తమిళ్ డెబ్యూ మూవీ. హరిహరన్ దర్శకత్వంలో
రూపొందుతోన్న చిత్రం ఇది. తర్వాత కాలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే ‘డీ
బ్లాక్’ ‘నెంజమెల్లం కాదల్’ సినిమాల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ద కోలీవుడ్
అయింది. మరోవైపు తెలుగులోనూ క్రేజీ ఆఫర్స్
ఈ సందర్బంగా అవంతిక మాట్లాడుతూ…
” మంచి సినిమాలు మంచి పాత్రలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. నటనకు ఎక్కువ
అవకాశం ఉన్న ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకుల
ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే తమిళ్ ఆడియన్స్ కూడా
ఆదరిస్తున్నారు. అందుకే రెండు భాషల్లోనూ నటన కొనసాగిస్తాను” అని
చెప్పింది.
ఇక భాషా పరమైన ఇబ్బందులను అడిగితే..
” అలాంటిది ఏం లేదు. అయినా కళ కు భాషతో పని లేదు. ఒక నటిగా ప్రేక్షకులను
ఎంటర్టైన్ చేయడమే నా టార్గెట్ గా భావిస్తాను” అని చెప్పింది ఈ బ్యూటిఫుల్
అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అవంతికా మిశ్రా.
All eyes on Avantika Mishra, as actress bags promising projects in
Kollywood & Tollywood
From a successful model to a shining actress, the journey of Avantika
Mishra is nothing but the product of talent and hardwork, coupled with
her graceful looks.
The New Delhi native, who had her education in Bengaluru, represented
top brands before making her cinema debut with Neelakanta’s Maaya. She
then played the lead in Meeku Meere Maaku Meme alongside Tarun Shetty.
After films like Vyshakam, Meeku Maathrame Cheptha and Bheeshma in
Telugu, she is making her Tamil debut with Enna Solla Pogirai being
directed by debutante Hariharan for Trident Arts production
co-starring Ashwin Kumar Lakshmikanthan.
She is also part of Nenjamellam Kadhal and D Block. These apart, the
actress is set to sign on the dotted line for a few more promising
projects in both Tollywood and Kollywood.
In D Block, she is acting alongside Arulnidhi. Directed by Vijay Kumar
Rajendran, it is tipped to be a college-based drama.
Says Avantika, “I am so happy to bag interesting projects which have
offered me good roles. All that I look for is challenging characters
that provide me scope to perform. I am so happy to receive the love of
Telugu audience and thankful to them. I am sure I will receive the
same from Tamil audience too, as Tamil Nadu is always known for
recognising talent. I will continue to act in both Tamil and Telugu
movies.”
Ask her whether she has faced any language barrier while acting in
south Indian languages, the actress says, “no, not at all. Art has no
languages and boundaries. As an artiste, it is my duty to make the
audience happy no matter what the language is.”