Darbar Movie Pre-Release Event
Audience will surely love the complete action-thriller ‘Darbar’: Superstar Rajinikanth at Pre-Release Event
‘Darbar’, coming in the direction of ‘Ghajini’ and ‘Thuppaki’ helmer AR Murugadoss, has the legendary Rajinikanth in the lead. Presented by Subaskaran of Lyca Productions, which bankrolls huge movies, this film has the Superstar in the role of a cop named Aditya Arunachalam. To hit the screens as a Sankranthi treat, it will be released by the famous producer NV Prasad in the Telugu States. The film will hit the screens as a Sankranthi special, on January 9.
The big-ticket action-drama’s pre-release event was held in Hyderabad’s Shilpakala Vedika on Friday evening. It saw the presence of the film’s cast and crew members. An action-packed release promo was unveiled on the occasion.
Speaking on the occasion, Ram-Lakshman duo said, “We had been wanting to do a Tamil movie and this is when Rajini sir offered us this movie. We felt extremely delighted. Murugadoss sir’s movies have a socially-relevant message in his movies. We will never forget the experience of working with Rajini sir.”
Vamsi Paidipally said, “Rajini sir’s life is a great inspiration. I have always loved Murugadoss’s working style. The audience have been wanting to see his film in combination with Rajini sir. I wish Anirudh, Santosh Sivan garu, Nivetha Thomas and others all the best. I wish Subaskaran sir, who is making big movies, all the best.”
Maruthi said, “The trailer and songs are great. It’s like watching a new Rajini sir altogether. I am excited to watch ‘Darbar’.”
Dil Raju said, “I was bowled over when I watched the final seconds of the film’s trailer. I am eagerly waiting for the movie. AR Murugadoss sir can do magic in any language. When I watched ‘Jeevana Poratam’, I tried to imitate Rajini sir as a kid. But I couldn’t. I wish that this film becomes a big hit.”
Harish Shankar said, “I have come here not as a director. I had never met Rajini sir before this. So, I came here today as his fan, wanting to take a pic with me. In this digital age, competition is witnessed over maximum hits, etc. But Rajini sir broke all records without the Internet, without big events, much publicity, etc decades ago. That’s how he became close to the Telugus. No matter which language he does a film in, the audience feel that Rajini sir is theirs. Murugadoss sir’s films have a social conscience and he is one of the greatest directors. Anirudh is doing a lot of Telugu movies. I wish him all the best.”
BVSN Prasad said that the film will definitely become a superhit because big men are associated with it.
Nivetha Thomas said, “Even though I observed Rajini sir during the making of the film, watching his energy in the trailer still amazed me. We like Vijay sir, or Ajith sir, or Mahesh Babu sir, or Pawan Kalyan sir, or Allu Arjun sir, or Nani.. But the one actor all these stars love is Rajini sir. His films are not seen as dubbed movies by the Telugu audience. Murugadoss sir believed that I can do this role and I thank him for that.”
Actor Dalip Tahil described Rajinikanth as one of the greatest superstars of the globe. “The style that Rajini bhai has, the swag he has is something I have not seen in any industry anywhere over the last 40 years,” he added.
Cinematographer Santosh Sivan said, “My first film with Rajini sir was ‘Dalapathy’. He looks young and energetic even now. It becomes easy to be a cinematographer of such an actor. Rajini sir’s radiance is unmatched.”
Suneil Shetty said, “By far I had one of my finest experiences working on the movie. At the helm, you have a director like Murugadoss sir. Santosh sir is a legend. With just a mobile phone, he can shoot better than 90 percent of cinematographers. Anirudh’s music is breathtaking. The entire team of Lyca Productions is outstanding. Rajini sir is a God of cinema. We all have a Rajini sir in us. All of us actors have copied something or the other from him. Above all, he is one of the finest humans. Being grounded and being a good human being is more important than anything else in the world.”
AR Murugadoss said, “My greetings to Superstar Rajinikanth sir’s fans. ‘Darbar’ is a very important film for me. After doing 13 films, I got the opportunity to work with the Superstar. This is also my first cop story. This is a pan-Indian film that needed the right sort of production house. Lyca Productions’ Subaskaran sir is a hero in real life. In the future, his life story might be made as a biopic. As for the film’s cast, I thank Nayanthara, Nivetha Thomas and others. Yogi Babu’s comedy is cool. Ram-Lakshman’s master’s stunt choreography is novel. A fight in the second half will have the audience clapping non-stop for five minutes. You will see the vintage Rajini sir in it. I thank music director Anirudh, whose songs and BGM are superb. Suneil Shetty sir has played a strong role as the antagonist. Art Director Santhanam sir, Executive Producer Sundarrajan, and others are incredible. ‘Darbar’ is a family entertainer. Go watch it on January 9.” ARM introduced his Assistant Directors and appreciated their hard work.
As he took the mike to speak, Superstar Rajinikanth was greeted with loud cheers. Rajini said, “I didn’t expect that this event will be this big. NV Prasad garu usually goes in for low-profile events. I guess he is damn sure that ‘Darbar’ will be a big hit. I am still the lead man at this age only because of the love of fans, the encouragement they show. I owe my energy and happiness to my belief that we have to expect less, eat modestly, sleep normally, exercise well and talk less. If you do these things, you will be happy forever. It was in 1976 that ‘Anthuleni Katha’ released in Telugu. 99 percent of those who are here today were not even born then. The Telugus love me as much as the Tamils. They have always encouraged good movies. My movies have done very well in Telugu not just because of me. During the making of a film, some magic has to happen. But that’s not in our hands. ‘Darbar’ felt like magic during the making stage. I had been wanting to work with Murugadoss for years. It finally happened with this film. Subaskaran is a very good friend of mine. He is such a good man and a huge businessman. He is now producing ‘Ponniyin Selvan’, which is a magnum opus like the ‘Baahubali’ movies. A subject like ‘Darbar’ is not easy to make. The story treatment, the technical elements have given life. The Ram-Lakshman duo are like Yogis. They are not ordinary. I have done 160 movies. ‘Darbar’ will be special. Suneil Shetty and others have done a very good job. I pray to God to give you all happiness.”
Cast & Crew
With Nayanthara as the hero’s pair, the big-ticket mass entertainer has Nivetha Thomas as Rajinikanth’s daughter. Bollywood actor Suneil Shetty, Yogi Babu, Thambi Ramaiah, Sriman, Pratheik Babbar, Jatin Sarna, Nawab Shah, Dalip Tahil and others are part of the cast.
PRO: Naidu Surendra Kumar-Phani, B.A. Raju. Fights: Peter Hein, Ram-Lakshman. Lyricist: Anantha Sriram, Krishnakanth. Art Direction: T Santanam. Editor: Srikar Prasad. Executive Producer: Sundar Raj. Cinematography: Santosh Sivan. Music: Anirudh Ravichandran. Production House: Lyca Productions. Written and directed by: AR Murugadoss. Producer: Subaskaran.
కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన `దర్బార్` కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది – సూపర్ స్టార్ రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఆదిత్య అరుణాచలంగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి జనవరి 9న తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా…
రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ – “చాలా రోజులుగా మేం తమిళంలో ఓ సినిమాను చేయాలని అనుకుంటున్న తరుణంలో రజినీకాంత్‌గారితో సినిమా చేసే అవకాశం రావడం చాలా గొప్పగా అనిపించింది. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన మురుగదాస్‌గారికి థ్యాంక్స్. సమాజం పట్ల బాధ్యతతో మంచి మెసేజ్‌తో సినిమాలు చేసే దర్శకుడాయన. రజినీకాంత్‌గారితో చేసిన ఈ జర్నీ ఎప్పటికీ మరచిపోలేం“ అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – “రజినీకాంత్గారిలోని కసి, జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. మా జనరేషన్స్‌లో ఎందరికో ఆయన ఇన్స్పిరేషన్. మురుగదాస్‌గారి వర్కింగ్ స్టైల్ ఎంతగానో నచ్చుతుంది. ఆయనతో కలిసి రజినీగారు సినిమా చేయాలని చాలా రోజులుగా అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికీ కుదిరింది. అనిరుధ్, సంతోశ్శివన్గారు, నివేదా, రామ్ లక్ష్మణ్ సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు. ఇలాంటి గొప్ప సినిమాలు చేస్తున్న నిర్మాత సుభాస్కరన్‌గారికి థ్యాంక్స్“ అన్నారు.
మారుతి మాట్లాడుతూ – “ ట్రైలర్, సాంగ్స్ మామూలుగా లేవు. రజినీకాంత్‌గారు మళ్లీ రిటర్న్ బ్యాక్ అన్నట్లుగా ఉంది. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “ట్రైలర్లో రజినీకాంత్‌గారు నడుచుకుంటూ వస్తున సీన్ చూసి ఫిదా అయిపోయాను. సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురుగదాస్గారైతే ఇటు తెలుగు, అటు తమిళం, హిందీ ఏ భాషైనా ఇరగదీసేస్తున్నారు. జనవరి 9న విడుదలవుతున్న సినిమా సూపర్‌హిట్ అవుతుందని గట్టి నమ్మకం ఉంది“ అన్నారు.
హరీశ్ శంకర్ మాట్లాడుతూ – “నేను ఇక్కడికి పెద్ద ఫ్యాన్‌ని. ఇంత పెద్ద రేంజ్లో మీడియావచ్చిన తర్వాత మనం రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ అవేవీ లేనప్పుడే భాషా, ముత్తు, నరసింహ, రోబో వంటి చిత్రాలతో అన్ని రికార్డులు బద్దలు కొట్టేశారు. తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు. ఏ లాంగ్వేజ్‌లో ఆయన్ని చూసినా ఆయన మనోడు అని భావిస్తారు. ఆయన సౌతిండియా సూపర్‌స్టారే కాదు.. ఇండియన్ సూపర్‌స్టార్. అలాగే మురగదాస్‌గారు ఎంటర్టైన్మెంట్తో పాటు సామాజిక బాధ్యత ఉన్న సినిమాలు చేస్తుంటారు. అనిరుధ్ అద్భుతమైన సంగీతం అందించారు. ఆయన నాతో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ – “హేమాహేమీలందరరూ కలిసి చేసిన ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుంది“ అన్నారు.
నివేదా థామస్ మాట్లాడుతూ – “రజినీ సార్‌లోని ఎనర్జీ ఎలా వస్తుందో నాకు అర్థం కాలేదు. ఇంత పెద్ద మూవీలో నాకు అవకాశం ఇచ్చిన మురుగదాస్‌గారికి థ్యాంక్స్. మంచి సినిమాలను ఎంకరేజ్‌చేసే ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారని నమ్మకం ఉంది“ అన్నారు.
సంతోశ్ శివన్ మాట్లాడుతూ – “దళపతి సినిమాలో నేను రజినీకాంత్‌గారితో కలిసి పనిచేశాను. చాలా సంవత్సరాలు తర్వాత ఆయనతో కలిసి దర్బార్ సినిమా చేయడం ఆనందంగా అనిపించింది. ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు“ అన్నారు.
సునీల్ శెట్టి మాట్లాడుతూ – “దర్బార్ టీమ్ నేను పనిచేసిన బెస్ట్ టీమ్స్‌లో ఒకటి. రజినీకాంత్‌గారు, సంతోష్ శివన్గారు, మురుగదాస్‌గారు, అనిరుధ్.. వీరందరినీ కలిపిన నిర్మాత సుభాస్కరన్‌గారికి థ్యాంక్స్. రజినీకాంత్‌గారిని అందరూ సూపర్‌స్టార్ అని అంటాం కానీ.. ఆయన్ని అందరూ గాడ్ ఆఫ్ సినిమా అంటాను. ఆయన్ని చూసి మేం చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎంత పెద్ద పేరు వచ్చినా కూల్‌గా ఉండటం ఆయన్ని చూసే నేర్చుకోవాలి“ అన్నారు.
డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ మాట్లాడుతూ – “నా కెరీర్లోనే దర్బార్ చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే నేను 13 సినిమాలు చేసినప్పటికీ రజినీకాంత్‌గారితో కలిసి చేసిన తొలి సినిమా ఇది. నేను డైరెక్ట్ చేసిన తొలి పోలీస్ స్టోరీ. అందరూ బాగా కష్టపడ్డారు. సినిమా చాలా బాగా వచ్చింది. జనవరి 9న సినిమా విడుదలవుతుంది. పాన్ ఇండియా సినిమా చేయాలంటే మంచి నిర్మాత కావాలి. ఆయనే సుభాస్కరన్‌గారు. ఆయన నిజ జీవితంలోనే హీరో. ఆయన జీవితంలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో సుభాస్కరన్గారిపై కూడా బయోపిక్ చేయవచ్చు. నయనతార, నివేదా థామస్ చక్కగా నటించారు. రామ్లక్ష్మణ్మాస్టర్స్కి థ్యాంక్స్. చాలా కొత్తగా ఫైట్స్‌ను కంపోజ్ చేశారు. 15 ఏళ్ల క్రితం రజనీకాంత్‌గారిని ఎలా చూశారో అదే స్పీడు, మాస్, స్టైల్ ఉన్న చిత్రమిది. అనిరుధ్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్.ఆర్ ఇంకా అద్భుతంగా ఇచ్చాడు. సునీల్ శెట్టిగారు రజినీకాంత్‌గారిని బ్యాలెన్స్ చేస్తూ విలనిజాన్ని పండించాడు. ఎంటైర్ యూనిట్‌కి థ్యాంక్స్“ అన్నారు.
సూపర్‌స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ – “నాకు 70 ఏళ్లు అవుతుంది. ఇంకా నేను హీరోగా యాక్ట్ చేస్తున్నాన్నంటే కారణం ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, ప్రోత్సాహమే కారణం. ఇంత వయసులోనూ ఇంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉన్నారని కొంత మంది అడుగుతుంటారు. తక్కువగా ఆశపడండి. తక్కవగా బాధపడండి.. తక్కువగా భోజనం చేయండి.. తక్కువగా నిద్ర పోండి.. తక్కువగా ఎక్సర్సైజ్ చేయండి, తక్కువగా మాట్లాడండి.. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం. 1976 తెలుగులో అంతులేని కథ విడుదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. తమిళ ప్రేక్షకులు నన్ను ఎలా ప్రేమిస్తారో అదే ప్రేమను తెలుగు ప్రేక్షకులు ఇవ్వడం నా భాగ్యంగా, పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను. తెలుగు ప్రేక్షకులు సినీ ప్రేమికులు. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారు. నేను చేసిన భాషా, ముత్తు, పెదరాయుడు, నరసింహ, చంద్రముఖి, రోబో కేవలం నాకోసమే ఆడలేదు. మంచి సినిమాలు. అందులో నేను కూడా యాక్ట్ చేశాను. అందరూ సినిమా బాగా హిట్ కావాలనే చేస్తారు. అయితే సినిమా చేసే సమయంలో ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ మన చేతుల్లో ఉండదు. అలాంటి మ్యాజిక్ ఈ సినిమాకు జరిగింది. మురుగదాస్‌గారితో పనిచేయాలని 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమాకు కుదిరింది. సుభాస్కరన్‌గారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. సినిమాలంటే ప్యాషన్ ఉన్న నిర్మాత. ఇప్పుడు కూడా బాహుబలిలాంటి సినిమా పొన్నియన్ సెల్వన్‌ను నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ ఆఫీసర్ పాత్రను చేశాను. ఈ కథను వింటే హీరో, నిర్మాత ఎలా చేశారీ సినిమాను అనుకుంటారు. కానీ మురుగదాస్‌గారు ఇచ్చిన స్క్రీన్‌ప్లే అద్బుతంగా ఉంది. కెమెరామెన్ సంతోశ్ శివన్, అనిరుధ్ మ్యూజిక్‌తో సినిమాకు వెయిట్ పెంచారు. రామ్ లక్ష్మణ్‌గారు అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. తిరుపతి ప్రసాద్‌గారు తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. దర్బార్ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. 168 సినిమాలు చేశాను. ఈ సినిమా డిఫరెంట్ మూవీ. దర్బార్ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ .సునీల్ శెట్టి సహా అందరూ చక్కగా నటించారు. అందరూ బావుండాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రజనీకాంత్ సరసన కథానాయికగా నయనతార, రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్, ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: సురేంద్ర నాయుడు- ఫణి కందుకూరి, బి.ఎ.రాజు, స్టంట్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుందర్ రాజ్, పాటలు: అనంత శ్రీరామ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, మ్యూజిక్: అనిరుద్ రవి చంద్రన్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, దర్శకత్వం: ఎ.ఆర్. మురుగదాస్.