Uday Sankar Interview photos
నా జీవితానికి అదే మిస్ మ్యాచ్ – ఉదయ్ శంకర్
ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ జంటగా డాక్టర్.సలీమ్ సినిమా దర్శకుడు నిర్మల్ దర్శకత్వంలో వస్తున్నా “మిస్ మ్యాచ్” రిలీజ్ కు సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా హీరో ఉదయ్ శంకర్ మీడియాతో మాట్లాడారు.
ఆట గదరా శివ టైం లో భూపతి రాజా గారు ఈ మిస్ మ్యాచ్ లైన్ చెప్పారు,
ఈ సినిమాలో లవ్,ఏమోషన్ అంతా ఉంది ఇది నాకు కావాలి సర్ అని చెప్పినప్పుడు ఆయన డెవలప్ చేసి చెప్పడం జరిగింది.
ఈ విషయంలో మిస్ మ్యాచ్ అయింది.?
రెండు వేర్వేరు కేరెక్టర్స్ లవ్ లో పడితే ఎలా ఉంటుందో అదే ఈ మిస్ మ్యాచ్.
నాకు ఆ అమ్మాయికి అస్సలు సింక్ అవ్వదు అందుకే ఈ సినిమాకి మిస్ మ్యాచ్ అని టైటిల్ పెట్టారు.
మిగతా లవ్ స్టోరీస్ కి వీటికి తేడా ఏంటి.?
ఈ కేరెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, మధ్యలో కొన్ని ట్విస్ట్ లు ఉంటాయి ,అమ్మాయి అబ్బాయి క్లైమాక్స్ లో ఎలా కలుస్తారు అనేది కథ.
గిన్నీస్ బుక్ లో ఎక్కిన మీరు ఈ ఫీల్డ్ కి రావడానికి కారణం ఏంటి.?
అదే నా జీవితానికి మిస్ మ్యాచ్,
చాలామంది అన్నారు ఈ క్వశ్చన్,
నేను ఇంటర్ బై.పి.సి చేసి డెంటిస్ట్ గా బెంగళూర్ లో జాబ్ చేసి,సినిమా మీద ఉన్న ఇంట్రస్ట్ అది కూడా వదిలేసా.
ఈ మనస్సే సాంగ్ రిమేక్ థౌట్ ఎవరిది.?
నాదే అండి,నేను పవన్ కల్యాణ్ పెద్ద ఫ్యాన్ అండి,ఎప్పటినుంచో అనుకున్నాను నేను హీరో అయితే ఈ సాంగ్ పెట్టుకోవాలి అని మొదటి సినిమాకి కుదర్లేదు ఈ సినిమాలో కూడా కావాలని పెట్టినట్లు ఉండదు,
లక్కీ గా ఈ సాంగ్ బాగా వచ్చింది ఇదంతా సింగేల్ టేక్ తీసాము, నాకు ఆయన మీద ఉన్న ప్రేమను ఇలా చూపించాను అంతే.
కళ్యాణ్ గారు ఏమన్నారు ఈ సాంగ్ చూసి.?
మీ కష్టం తెలుస్తోంది ఈ సాంగ్ లో ఇది సింగిల్ షాట్ కదా,చాలా బాగా తీశారు.
ఐశ్వర్య రాజేష్ చాలా సీనియర్ కదా మీకు ఏమనిపించింది.?
ఫస్ట్ రెండు రోజులు కొంచెం ఇబ్బంది పడ్డాను తరువాత ఆమె అందరితో ఈజీ కలిసిపోయి మాతో కలిసి భోజనం చేయడం అందరితో ఫ్రెండ్లీ గా ఉండటం వలన ఫ్రీగా చేసేసాం.
నెక్స్ట్ సినిమా విషయాలు…
ఈ సినిమా ఆడితేనే మళ్ళీ నెక్స్ట్ సినిమాలు.ఇది ఆడాలి,ఆడాలని కోరుకుంటున్నాను.