Eagerly waiting for a chance with prabhas
ప్రభాస్‌తో ఒక్కసారైనా….
ఆర్ఎక్స్ 100తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రం తర్వాత వరసగా ఇప్పుడు తెలుగులో నటిస్తుంది ఈ భామ. ఇప్పటికే వెంకటేష్ వెంకీ మామా సినిమాలో కూడా నటిస్తుంది పాయల్.
ఆ సినిమాలో తెగ బోల్డ్ గా నటించి ప్రేక్షకుల దృష్టినే కాకుండా ఫిలింమేకర్ల దృష్టిని కూడా ఆకర్షించింది. పాయల్ త్వరలో ‘RDX లవ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై అందరినీ ఆకర్షించింది. హాట్ సీన్లు.. బోల్డ్ డైలాగ్స్ ఉండే ఫిమేల్ ఓరియెంటెడ్ స్టొరీలా కనిపిస్తోంది. సినిమా టైటిల్ కు తగ్గట్టు పాయల్ పాత్ర RDX లాగానే ఉంది.
ఈ భామ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాగురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ‘RDX లవ్’ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. ప్రభాస్.. విజయ్ దేవరకొండలో ఎవరు హాట్ గా ఉంటారు అని పాయల్ ను అడిగితే తడుముకోకుండా ప్రభాస్ పేరు చెప్పేసింది. దానికి కారణం చెప్తూ ప్రభాస్ లో ఒక స్పార్క్ ఉంటుందని.. తన బాడీ లాంగ్వేజ్ లో ఉండే స్టైల్ యాటిట్యూడ్ ప్రత్యేకంగా ఉంటాయని చెప్పింది. అంతే కాదు ప్రభాస్ తో పని చేయాలని ఉందని కూడా పాయల్ తన మనసులోని మాటను కూడా బైటపెట్టింది.
ఆ విషయం పక్కన పెడితే పాయల్ ‘RDX లవ్’ తో పాటుగా మరో మూడు సినిమాల్లో నటిస్తోంది. వెంకటేష్ తో ‘వెంకీమామ’.. రవితేజ తో ‘డిస్కో రాజా’ లో నటిస్తోంది. ‘ఏంజెల్’ అనే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది. అంతేకాక ఎక్కువగా బోల్డ్‌గా ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంది. చాలావరకు హీరోయిన్లు ఇలాంటి పాత్రలు చేయడం అరుదు. కాని పాయల్ మాత్రం ఒక డిఫరంట్ పంథాలో వెళుతుందనే చెప్పాలి.