Introducing Gautham Vasudev Menon As Major Selvan In Sita Ramam
Introducing Gautham Vasudev Menon As Major Selvan In Sita Ramam
Class and sensible filmmaker Gautam Vaudev Menon has played the role of Major Selvan in the upcoming musical romantic entertainer Sita Ramam being directed by Hanu Raghavapudi. Looks bit serious here, Gautam Menon seems to be a perfect choice for the role. The glimpse gives detailing about his appearance and mood. However, it doesn’t have a dialogue.
There is importance for every actor in the movie. Dulquer Salmaan and Mrunal Thakur are the lead pair in the movie that stars several noted actors including Rashmika Mandanna, Sumanth, Tharun Bhascker etc. in important roles. It will be eye-pleasing to see so many popular actors in this film that is being made as a visual extravaganza.
Songs, teaser and intro videos of all the actors got tremendous response. There’s huge eagerness for the theatrical trailer of the movie now.
Aswini Dutt is producing the movie under Swapna Cinema, while Vyjayanthi Movies presents it. Vishal Chandrashekhar has provided music for the movie that has cinematography by PS Vinod.
The film being made simultaneously in Telugu, Tamil and Malayalam languages will release in cinemas on August 5th.
క్లాస్ అండ్ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గౌతమ్ వౌదేవ్ మీనన్, హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సీతారామం’లో మేజర్ సెల్వన్ పాత్రను పోషించారు. ఆయన పాత్రని పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో సీరియస్గా లుక్ లో కనిపించి క్యురియాసిటీని పెంచారు. గౌతమ్ మీనన్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ గా నిలిచారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్ మేజర్ సెల్వన్ లుక్ ని వివరంగా చూపించింది.
సినిమాలో నటీనటులందరూ కథలో కీలక భూమిక పోషించనున్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దృశ్యకావ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు చూడటం ప్రేక్షకులకు కన్నులపండగ కాబోతుంది.
పాటలు, టీజర్, నటీనటుల పరిచయ వీడియోలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ పై భారీ ఆసక్తి నెలకొంది.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.