Sarileru Neekevvaru, Review
సంక్రాంతి మొగుడు కాదు అల్లుడే – సరిలేరు నీకెవ్వరు
నటీనటులు:మహేష్ బాబు,రష్మిక, విజయశాంతి, ప్రకాష్ రాజ్,రావు రమేష్ తదితరులు
దర్శకత్వం:అనిల్ రావిపూడి
నిర్మాతలు:అనిల్ సుంకర,దిల్ రాజు, మహేష్ బాబు
సంగీతం:దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ:రత్న వేలు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంటుంది.
ఆ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కథ:
అజయ్ (మహేష్ బాబు) మిలిటరీ లో ఒక దమ్మున్న సోల్జేర్,
ఏ పనిని అప్పగించిన దైర్యంగా చేసి గెలుస్తాడు,
తన భర్తను పొగుట్టుకున్న భారతీ (విజయశాంతి) ఒక కాలేజ్ లో సిన్సియర్ లెక్చరర్,
తప్పు ను తప్పు అని చూపించే ఒక బలమైన వ్యక్తిత్వంతో ఉంటుంది.
తన పెద్ద కొడుకుని మిలట్రీ లో కోల్పోయిన కూడా దేశం మీద ప్రేమతో తన రెండవ కొడుకు అజయ్ ని (సత్యదేవ్)
కూడా మిలట్రీ కి పంపిస్తుంది,
ఇంత సిన్సియర్ గా ఉన్న భారతీ లైఫ్ లోకి ప్రాబ్లమ్ ఎలా వచ్చింది,
ఆ ప్రాబ్లెమ్ కి పరిష్కారం చూపించడానికి అజయ్ (మహేష్ బాబు) ఎందుకు వచ్చాడు.?
అసలు ఆమెకు అజయ్ కు ఉన్న సంబంధం ఏంటి.?
ఆ ప్రాబ్లమ్ అజయ్ ఎలా క్లీయర్ చేసాడు.?
భారతీ రెండవ కొడుకు అజయ్ ఏమయ్యాడు.?
భారతీ కి కర్నూలు మినిస్టర్(ప్రకాష్ రాజ్) కి జరిగిన అసలు గొడవ ఏంటి.? అనే అంశాలు సినిమాలో చూడాల్సిందే.!
విశ్లేషణ:
హీరో మహేష్ బాబు కి మహర్షి లాంటి హిట్ తర్వాత, దర్శకుడు అనిల్ రావిపూడి కి f2 లాంటి ఫామిలీ హిట్ తర్వాత వాళ్లిద్దరూ కాంబినేషన్ లో ఈ సినిమా రావడంతో సినిమా ప్రేక్షకులకు అంచనాలు మొదలయ్యాయి.
అయితే ఈ “సరిలేరు నీకెవ్వరు” ఈ అంచనాలను అందుకుందా అంటే కొంతమేరకు అవును అనే చెప్పాలి.
దర్శకుడు ఈ సినిమాని అటు ఫ్యామీలి ఆడియన్స్ కు ఇటు మహేష్ బాబు అభిమానులకు నచ్చేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేసాడు,
అయితే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మహేష్ అభిమానులకు ఒక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు.
యాక్షన్ సీన్స్ లోనూ, డాన్స్ లోను మహేష్ బాబు అదరగొట్టాడు,
చాలా రోజులు తర్వాత మహేష్ కామెడీ టైమింగ్ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తుంది.
విజయ శాంతి తనకున్న పరిధిలో అధ్బుతంగా చేసింది,తన పాత్రకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది, హీరోయిన్ రష్మిక చేస్తున్న పెరఫార్మన్స్ అక్కడక్కడ ఎబ్బెట్టుగా ఉంటుంది,ఈ విషయంలో దర్శకుడు ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుణ్ణు అనిపిస్తుంది.అక్కడక్కడా కామెడీ సీన్స్ గట్టిగా పేలాయి,
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది అనిపిస్తుంది.రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా చెప్పాల్సిన పని ఏముంది….? అదిరిపోయింది అంతే.
మహేష్ బాబు ఇంటర్వెల్ ముందు చెప్పే డైలాగ్స్,యాక్షన్ సీన్స్ మొత్తం సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరో వ్యక్తి ప్రకాష్ రాజ్, తన నటనతో సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్లాడు, మహేష్ బాబు,ప్రకాష్ రాజ్ మధ్యలో కొన్ని సీన్స్ అద్భుతంగా ఉంటే…
క్లైమాక్స్ మాత్రం అరేయ్ ఏంటి ఇంత సింపుల్ గా తేల్చేస్తున్నారు అని ఫీలింగ్ కలుగుతుంది.
మొత్తానికి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు,మహేష్ బాబు అభిమానులకు మంచి సంతృప్తి ఇస్తుంది అని చెప్పొచ్చు.
Rating:3/5