New movie launch under the banner of Puneet Studios with Saptagiri as the hero

సప్తగిరి హీరోగా పునీత్ స్టూడియోస్ బ్యానర్ లో నూతన చిత్రం ప్రారంభం !!!
90టీస్ బ్యాక్ డ్రాప్ లో సప్తగిరి చిత్రం !!!
సప్తగిరి హీరోగా శృతి పాటిల్ హీరోయిన్ గా పునీత్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కబోతున్న సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ప్రముఖ అస్ట్రాలజీయర్ బాలు మున్నంగి దేవుని పటాలపై క్లాప్ కొట్టడం జరిగింది. సురేష్ కోడూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వలసపల్లి మురళీమోహన్ నిర్మాతగా నూక రమేష్ కుమార్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీధర్ నార్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. Ggvk చిరంజీవి (గోపి) ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు.
ఫిబ్రవరి 21 నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. 90టీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఉండబోతున్నాయని చిత్ర దర్శకుడు సురేష్ కోడూరి తెలిపారు.